Viral: ఖరీదైన కాఫీ అని ఎగబడి తాగుతున్నారా..? ఎలా తయారు చేస్తారో చూస్తే వాంతులే..

రోజూ పొద్దునే కప్పు కాఫీ తాగనిదే చాలామంది డే స్టార్ట్ అవ్వదు. అలాంటిది మీకో కాఫీ గురించి చెప్పుబోతున్నాం. ఇది అట్లాంటి.. ఇట్లాంటి కాఫీ కాదు.. అత్యంత ఖరీదైన కాఫీ. కానీ దీని తయారీ రహస్యం తెలిస్తే

Viral: ఖరీదైన కాఫీ అని ఎగబడి తాగుతున్నారా..? ఎలా తయారు చేస్తారో చూస్తే వాంతులే..
Coffee
Follow us

|

Updated on: Sep 06, 2024 | 1:31 PM

రోజూ పొద్దునే కప్పు కాఫీ తాగనిదే చాలామంది డే స్టార్ట్ అవ్వదు. అలాంటిది మీకో కాఫీ గురించి చెప్పుబోతున్నాం. ఇది అట్లాంటి.. ఇట్లాంటి కాఫీ కాదు.. అత్యంత ఖరీదైన కాఫీ. కానీ దీని తయారీ రహస్యం తెలిస్తే వాంతులు చేసుకుంటారు. లువాక్ కాఫీ. లేదా కోపీ లువాక్.. ఇది అత్యంత ఖరీదైన కాఫీ. లువాక్ అనేది ఓ రకమైన పిల్లి. దాని ఆధారంగానే ఈ కాఫీకి పేరు వచ్చింది. లువాక్ జాతి పిల్లులు ఎక్కువగా ఇండోనేషియాలో ఉంటాయి. ఈ పిల్లి తోక కోతి తోక మాదిరిగా పొడవుగా ఉంటుంది.

లువాక్ కాఫీని సివెట్ అనే పిల్లి మలంతో తయారు చేస్తారు. ముందుగా ఆ పిల్లికి పచ్చి కాఫీ గింజలు తినిపిస్తారు. ఆ తర్వాత పిల్లి మలంతో వచ్చే కాఫీ భాగాన్ని వేరు చేసి.. దానితో కాఫీ తయారు చేస్తారు. పిల్లి ప్రేవుల్లోంచి వెళ్తే కాఫీకి రుచి బాగా పెరుగుతుందని వారి నమ్మకం. సివెట్ పిల్లి మలం నుంచి వేరు చేసిన కాఫీ గింజల్ని బాగా శుభ్రం చేసి.. ఆ తర్వాత వాటిని బాగా డ్రై ఫ్రై చేస్తారు. ఎలాంటి జర్మ్స్ లేకుండా ఉండేందుకు వాళ్లు ఇలా చేస్తారు. ప్రపంచంలోనే ఖరీదైన ఈ కాఫీ ధర రూ. 2 వేల నుంచి 6 వేలు ఉంటుంది. ఒక కిలో లువాక్ కాఫీ గింజలు రూ. 50 వేలు పలుకుతాయి.