Telangana: అరె.. విద్యార్థులకు ఝలక్.. ఆ రోజు సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రకటన

ఇటీవలి కాలంలో స్కూళ్లకు తెగ సెలవులు వస్తున్నాయి. వరుణుడి బీభత్సంతో ఆకస్మికంగా సెలవులు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఓ సెలవును రద్దు చేసింది.

Telangana: అరె.. విద్యార్థులకు ఝలక్..  ఆ రోజు సెలవు రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రకటన
Students
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 08, 2024 | 9:13 AM

వర్షాల నేపథ్యంలో బడులు సరిగ్గా సాగడం లేదు. వరుణుడి బీభత్సానికి ఆకస్మికంగా సెలవులు ప్రకటించాల్సి వస్తోంది. దీంతో పిల్లల చదవులు అటకెక్కుతున్నాయని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇక వచ్చే వారంలో కూడా  సెప్టెంబర్ 14వ తేదీ సెకండ్ సాటర్ డే కాబట్టి పాఠశాలలకు సెలవు ఉంటుంది. 15వ తేదీ ఆదివారం అవ్వడం చేత వరసగా 2 రోజులు సెలవులు వచ్చినట్లైంది. అలాగే.. 16న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గవర్నమెంట్ హాలిడే ఉంటుంది.. అలానే 17న వినాయక నిమజ్జనోత్సవం కాబట్టి.. ఆ రోజు కూడా హాలిడే ఉంటుంది.. దీంతో వరుసగా 4 రోజులు సెలవులు ఎంజాయ్ చేయొచ్చన స్టూడెంట్స్ భావించారు. ఐతే.. తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును క్యాన్సిల్ చేసింది.

14, 15వ తేదీల్లో సెలవులు అలాగే ఉండగా.. 16న మిలాద్ ఉన్ నబీ పండుగ డేట్ మారింది. నెలవంక కనిపించే తేదీ మారడం చేత ఈ పండుగను 16న కాకుండా.. 17న జరుపుకోవాలని ముస్లిం పెద్దలు నిర్ణయానికి వచ్చారు. దాంతో 16వ తేదీన హాలి డే క్యాన్సిల్ చేసి.. 17న ఇస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఐతే.. 17న నిమజ్జనం సెలవు  ఆల్రెడీ ఉంది కాబట్టి..  స్టూడెంట్స్ ఒక  రోజు సెలవు మిస్ అవుతున్నట్లే.

చాలామంది స్టూడెంట్స్ వరుస సెలవుల నేపథ్యంలో రకరకాల ప్లానింగ్స్ వేసుకున్నారు. కానీ గవర్నమెంట్ వారికి ట్విస్ట్ ఇచ్చింది. ఒక రోజు స్కూల్‌కి వెళ్లకపోయినా ఏం కాదు అనుకునేవారు.. వారి ప్లానింగ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు.

17న మిలాద్ ఉన్న నబీ ఉన్నా.. ఊరేగింపు మాత్రం 19వ తేదీకి వాయిదా వేయబోతున్నారని సమాచారం. వినాయకుడి నిమజ్జనానికి ఇబ్బంది కలగకుండా ముస్లిం పెద్దలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..