CV Anand: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. హైదరాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్..
కాంగ్రెస్ సర్కార్ ఐపీఎస్‌ల బదిలలో మరోసారి తన మార్క్ చాటుకుంది. సీనియర్ ఐపీఎస్‌లకు కీలక బాధ్యతలను అప్పగించింది. సీవీ ఆనంద్ రెండోసారి హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డిని విజిలెన్స్ డీజీగా నియమించింది ప్రభుత్వం.
మరోసారి మార్పు మార్క్.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. తాజాగా పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసింది. కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌ను హైదరాబాద్ సీపీగా నియమించారు. శ్రీనివాస్‌రెడ్డి విజిలెన్స్ డీజీగా బదిలీ చేశారు. సీవీ ఆనంద్ స్థానంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజయ్‌కుమార్‌ను ఏసీబీ డీజీగా నియమించారు. ఇక లా అండ్ ఆర్డర్ అడిషినల్ డీజీ గా ఉన్న మహేష్ భగవత్‌కు పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా పూర్తి బాధ్యతలను అప్పగించారు. ఇక పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం.రమేష్‌కు అదనపు బాధ్యతలను కేటాయించింది ప్రభుత్వం. ఐపీఎస్‌ల తాజా బదిలీలు చర్చగా మారాయి.
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌కు ఇది రెండో ఛాన్స్. 2022 డిసెంబర్‌లో ఆయన హైదరాబాద్ సీపీగా బాధ్యలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో సీఈసీ ఆయన్ని బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక సీవీ ఆనంద్‌ను ఏసీబీ డీజీగా నియమించారు. తనదైన స్టయిల్‌లో ఏసీబీలో సంస్కరణలు చేపట్టారాయన. ఎంతో మంది అక్రమార్కులను కటకటాల బాటపట్టించారు.
ఇక కాంగ్రెస్ సర్కార్ ఏర్పాడ్డాక కొత్త కోట శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాద్ సీపీగా నియమించింది. శాంతి భద్రతలు.. డ్రగ్స్ కట్టడిలో ఆయన తన మార్క్ చాటుకున్నారు. ఇటీవలే శ్రీనివాస్ రెడ్డికి డీజీ హోదా లభించింది. ఐనప్పటికీ ఆయన సీపీగా కొనసాగారు. ఇక అల్రెడీ డీజీ హోదా ఉన్న సీవీ ఆనంద్ రెండోసారి హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక అడిషనల్ డీజీ మహేష్ భగవత్‌కు పోలీస్ పర్సనల్ అండ్ వెల్ఫేర్ బాధ్యతలను అప్పగిచండం, ఎం రమేష్‌ను పోలీస్ స్పోర్ట్స్‌గా ఐజీగా నియమించడం ద్వారా పోలీస్ డిపార్ట్‌మెంట్ సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ రెండోవ సారి నియామకం అవడం ఒక రికార్డ్ గా చెబుతున్నారు .. ఓకే పోస్ట్ కు రెండోవ సారి అదే అధికారికి నియామకం అవ్వడం పోలీస్ డిపార్ట్మెంట్ లో విశేషమని పేర్కొంటున్నారు. అయితే.. హైదరాబాద్ సిపిగా త్వరలోనే సివి ఆనంద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..