23 మందితో రూమ్ షేరింగ్.. రూ.1లక్ష 76వేలు అద్దె.. వామ్మో ఇక్కడ జీవించాలంటే చచ్చి బతకాల్సిందే

అతని నెలవారీ చెల్లింపులో వైఫై, యుటిలిటీలు, గృహోపకరణాలు, వారంవారీ హోం క్లీనింగ్‌ సదుపాయం, నెలవారీ సామూహిక అల్పాహారం ఉన్నాయి. ఇకపోతే, ఇక్కడ వీరు చెల్లించే గది అద్దె ధరలో బెడ్‌రూమ్‌లో బెడ్, స్టోరేజ్ స్పేస్, డెస్క్, డెస్క్ లైట్, వాక్-ఇన్ క్లోసెట్ ఉన్నాయి. వారంతా ఒకే బాత్రూం పంచుకోవాల్సి వచ్చింది. భవనం నేలమాళిగలో పెద్ద సోఫా కూడా ఉంది. ఇది కాకుండా, కొన్ని జిమ్ పరికరాలు కూడా ఉన్నాయి.

23 మందితో రూమ్ షేరింగ్.. రూ.1లక్ష 76వేలు అద్దె.. వామ్మో ఇక్కడ జీవించాలంటే చచ్చి బతకాల్సిందే
New York Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2024 | 1:16 PM

న్యూయార్క్ నగరం..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలలో ఒకటి. అత్యంత అద్భుతమైన, అత్యంత ఖరీదైన నగరంగా చెబుతారు. న్యూయార్క్‌ నగరంలో జీవించాలనేది ఎంతో మందికి కల.. అయినప్పటికీ.. ఈ నగరం ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షిస్తుంది. ఇక్కడి అవకాశాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మీరు కెరీర్‌ను నిర్మించుకోవాలని కలలు కంటున్నవారు, విదేశాల్లో ఉన్నత చదువు పూర్తి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నా, వ్యాపారంలో విజయాల ఎత్తులను తాకాలనుకున్నా, ప్రతి కలను రియాలిటీగా మార్చడానికి న్యూయార్క్ అవకాశం ఇస్తుంది. కానీ, ఇక్కడ జీవించటం అనేది మాత్రం అంత ఈజీ కాదు. అంత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఈ నగరంలో నివసిస్తున్న ఒక వ్యక్తి న్యూయార్క్‌లో నివసించిన అనుభవాన్ని పంచుకున్నాడు. కాగా, ప్రస్తుతం అతడు పెట్టిన పోస్ట్‌ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాస్ట్లీ నగరం న్యూయార్క్‌లో అధిక ఖర్చును తగ్గించుకునేందుకు చాలా మంది రూమ్‌లను షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఈ నగరంలో నివసిస్తున్న ఒక వ్యక్తి న్యూయార్క్‌లో నివసించిన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇషాన్ అబేసేకేరా అనే 33 ఏళ్ల ఇంజనీర్, న్యూయార్క్‌లో తన ఆర్థిక పరిస్థితిని నిలబెట్టుకోవడానికి చాలా విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈయన 2022లో లండన్ నుంచి అమెరికా వచ్చాడు. ఇక్కడ తను ఇంకో 20 మందితో కలిసి ఒక ఇంటిని షేర్‌ చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా పోస్ట్‌ ద్వారా వెల్లడించారు.

ఇది ఒక పెద్ద ఇల్లు అయినప్పటికీ, ప్రతి నెలా అద్దె 2,100 అమెరికన్ డాలర్లు (సుమారు 1,76,000 రూపాయలు) అవుతుందట. న్యూయార్క్‌లో చాలా మంది యువకులు ఒంటరిగా ఇల్లు అద్దెకు తీసుకోలేరు. ఖర్ఛు భరించలేరు. అందుకే షేర్డ్‌ అపార్ట్‌మెంట్‌లోనే అద్దెకి ఉండడానికి ఆసక్తి చూపిస్తారు. దీని వల్ల వారికి అద్దె భారం తగ్గుతుంది. అంతేకాకుండా, ఇతరులతో కలిసి ఉండటం వల్ల సమాజంలో చాలా మంది ప్రజలతో కలిసి జీవిస్తున్నమనే అనుభూతి కలుగుతుందని చెప్పాడు. అతని నెలవారీ చెల్లింపులో వైఫై, యుటిలిటీలు, గృహోపకరణాలు, వారంవారీ హోం క్లీనింగ్‌ సదుపాయం, నెలవారీ సామూహిక అల్పాహారం ఉన్నాయి. ఇకపోతే, ఇక్కడ వీరు చెల్లించే గది అద్దె ధరలో బెడ్‌రూమ్‌లో బెడ్, స్టోరేజ్ స్పేస్, డెస్క్, డెస్క్ లైట్, వాక్-ఇన్ క్లోసెట్ ఉన్నాయి. వారంతా ఒకే బాత్రూం పంచుకోవాల్సి వచ్చింది. భవనం నేలమాళిగలో పెద్ద సోఫా కూడా ఉంది. ఇది కాకుండా, కొన్ని జిమ్ పరికరాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే, ఇషాన్‌ ముందుగా అతను న్యూయార్క్‌కు మారినప్పుడు.. కంపెనీ తనకు వసతి ఏర్పాటు చేసిందని చెప్పాడు. కొన్ని నెలలు అక్కడ ఉండి, ఆ తరువాతే తను ఓ అద్దె ఇంటికి మారాల్సి వచ్చిందన్నాడు. న్యూయార్క్‌లో ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు కోహబ్ స్పేస్‌ని చూశానని చెప్పాడు. ఈ భవనంలో నాలుగు అంతస్తులు, 24 పడక గదులు ఉన్నాయని చెప్పారు. ఇక చేసేది లేక తాను ఇక్కడి ఉండిపోయాయని చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..