Viral Video: మీరు లొట్టలేసుకుంటూ తినే మోమోస్ ఎలా తయారు చేస్తున్నారో చూడండి
మీకు మోమోస్ అంటే ఇష్టమా..? బయటకు వెళ్తే వాటిని తినాల్సిందేనా..? అయితే ఈ వీడియో చూసిన తర్వాత మరోసారి బయట మోమోస్ తినాలంటే ఒకటికి.. వందసార్లు ఆలోచిస్తారు. మేకింగ్ విధానం అలా ఉంది మరి..
ప్రస్తుతం మోమోస్ ప్రియుల సంఖ్య బాగా పెరిగింది. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మోమోలను లైక్ చేస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు ఆవురావురుమంటూ వేడి వేడిగా వాటిని లాగించేస్తున్నారు. మీకూ మోమోస్ అంటే ఇష్టమా? ఐతే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. ఇది చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కూడా మాకు తెలియజేయండి. తాజాగా మోమోస్ మేకింగ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో వైరల్‌గా మారడంతో మోమోస్ ప్రేమికులు అమ్మ బాబోయ్ అని తలపట్టుకుంటున్నారు.
వీడియో దిగువన చూడండి…
मध्यप्रदेश के जबलपुर में मोमोज बनाने के लिए दुकानदार ने पैर से गूंथा आटा, पुलिस ने दो लोगों को किया अरेस्ट#MadhyaPradesh #Momos #MomosLover #ViralVideo #MPPolice pic.twitter.com/2ISzIXsqz0
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) September 7, 2024
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఒక ప్రాంతంలో మోమోస్ తయారు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. మీరు దీన్ని చూసిన తర్వాత ఎప్పటికీ మోమోస్ తినాలనుకోరు. ఈ వీడియోలో మోమోస్ చేయడానికి ఒక వ్యక్తి పిండిని పిసికడం చూడవచ్చు. అయితే ఆ పిండిని అతను చేతులతో పిసికితే ప్రాబ్లం లేదు. కానీ అతను కాళ్లతో ఆ పని చేస్తున్నాడు. అవును నిజమే.. పెద్ద పాత్రలో పిండి వేసి దాని లోపల నిలబడి కాళ్లతో పిండి తొక్కుతున్నాడు. ఈ వైరల్ వీడియో తీసిన స్థానికులు.. ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఇలా మోమోస్ తయారు చేస్తోన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని నేపథ్యంలో, కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
నిందితులు ఇద్దర్నీ రాజస్థాన్‌కు చెందిన రాజ్‌కుమార్ గోస్వామి, సచిన్ గోస్వామిగా గుర్తించారు. వారు జబల్‌పూర్‌లోని బార్గి పోలీస్ స్టేషన్ పరిధిలో పరిధిలో మోమోస్ దుకాణం నడుపుతున్నట్లు తెలిపారు. ఈ వీడియో చూసిన తర్వాత, ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..