Watch: వందేభారత్‌ రైలు.. లోకో పైలట్ల నడుమ ఫైటింగ్‌.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు..!

ఈ వీడియో వెయ్యికి పైగా వీక్షణలు పొందింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. రైలు సీటు కోసం ప్రయాణికులు పోరాడుతుంటే, పైలట్ రైలును నడపడానికి పోరాడుతున్నాడని నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. వందేభారత్‌ రైలుకే ఇలా ఉన్నారు. ఇక, బుల్లెట్ రైలు ప్రవేశపెడితే పైలట్ల గొడవ ఎలా ఉంటుందో ఊహించండి అని మరొకరు కామెంట్‌లో పేర్కొన్నారు.

Watch: వందేభారత్‌ రైలు.. లోకో పైలట్ల నడుమ ఫైటింగ్‌.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు..!
Clash Between Loco Pilots
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 08, 2024 | 3:36 PM

సాధారణంగా ప్రయాణికులు సీట్ల కోసం కొట్లాడుకోవడం మనం చూస్తూనే ఉంటాం. బస్సులో, రైలులో సీటు కోసం కొందరు రుమాలు, బ్యాగులు, ఇతర మాయలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఇది సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవ కాదు. ఇద్దరు పైలట్లు రైలును నడపడానికి పోరాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

రాజేంద్ర బి. అక్లేకర్ అనే ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేస్తూ..ప్రతిష్టాత్మకమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపడానికి లోకో పైలట్ల మధ్య జరిగిన పోరాటం భారతీయ రైల్వేలకు అవమానం అని రాసింది. వైరల్ అయిన ఒక వీడియోలో లగ్జరీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ క్యాబిన్‌లోకి ప్రవేశించడానికి లోకో పైలట్లు పెనుగులాడుతుండటం కనిపించింది. ముందుగా లోకో పైలట్ ఒకరు ఆగ్రా-ఉదయ్‌పూర్ రైలులోని పైలట్ల కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి డోర్ లాక్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ రైలును నేను నడుపుతానంటే నేనే అంటూ కొందరు లోకో పైలట్లు గొడవకు దిగారు. కానీ డోర్ తీయకపోవడంతో ఈ రైలు కిటికీలోంచి ఒక్కొక్కరుగా లోకోపైలట్లు దొంగల్ల దూరి రైలు ఎక్కుతున్నారు. ఈ వందేభారత్ రైలును నడపాలని ఒకరి బట్టలు ఒకరు చించుకునేంత వరకు పోరాడారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ప్రయాణికులు కూడా లోకో పైలట్లను ప్రోత్సహించారు. కాగా, నెట్టింట వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూడండి..

ఈ వీడియో వెయ్యికి పైగా వీక్షణలు పొందింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. రైలు సీటు కోసం ప్రయాణికులు పోరాడుతుంటే, పైలట్ రైలును నడపడానికి పోరాడుతున్నాడని నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. వందేభారత్‌ రైలుకే ఇలా ఉన్నారు. ఇక, బుల్లెట్ రైలు ప్రవేశపెడితే పైలట్ల గొడవ ఎలా ఉంటుందో ఊహించండి అని మరొకరు కామెంట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..