విన్నూత్న రీతిలో గణేశుడి గ్రామోత్సవం.. జేసీబీ వాహనం పై ఏకదంతుని ఊరేగింపు..
రాయగూడం గ్రామంలో మాత్రం గ్రామస్తులు వెరైటీగా ఓ జెసిబి (JCB)లో వినాయకుడిని పెట్టి ఊరంతా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులంతా వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొండలను గుట్టలను గుల్ల చేయటంతో పాటు, చెట్ల పొదలను తొలగించే జెసిబి ఇప్పుడు గణేశుడి గ్రామోత్సవం నిర్వహించింది. వినాయక నిమజ్జనానికి ఇలా వెరైటీగా జేసిబిని ఉపయోగించారు అక్కడి ప్రజలు. గణేష్ నవరాత్రులు కన్నుల పండగ నిర్వహించిన అనంతరం శోభాయాత్ర నిర్వహించి గణేష్ ని నిమజ్జనం చేస్తారు. గణేష్ ని మజ్జనానికి తరలించడానికి వాహనాలను అందంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. కానీ, ఖమ్మం జిల్లాలో మాత్రం వినూత్నం వినాయక నిమజ్జనం నిర్వహించారు.
వినాయకుడు నిమజ్జనం సందర్భంగా గణనాధుడుని తరలించడానికి ఎక్కువగా ట్రాక్టర్లు, లారీలు ఏర్పాటు చేసుకొని వాటిలో వినాయకుడి విగ్రహాలు పెట్టి తరలిస్తారు. కానీ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాయగూడం గ్రామంలో మాత్రం గ్రామస్తులు వెరైటీగా ఓ జెసిబి (JCB)లో వినాయకుడిని పెట్టి ఊరంతా ఊరేగింపు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు. ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామస్తులంతా వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వీడియో చూడండి..
జెసిబి.(JCB) ఎదుట మహిళలు, యువకులు నృత్యాలు చేస్తూ గణేష్ ని గ్రామంలోని వీధుల వెంట ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. గణేశుడికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఊరేగింపు అనంతరం నిమజ్జనం చేశారు. జెసిబి సహాయంతో వినాయకుని ఊరేగింపుని పలువురు ఆసక్తిగా తిలకించారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..