AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యాన్‌ ఈటర్‌గా మారిన చిరుత..! ముగ్గురిని చంపేసింది.. రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల ఆందోళన

ఆ మరుసటి రోజున చిధ్రమైన ఆమె మృతదేహం అడవిలో కనిపించింది. మరోవైపు భెడియా నుంచి గ్రామానికి తిరిగి వస్తున్న ఖేమారామ్‌, అతడి కొడుకుపై చిరుత దాడి చేసింది. బాలుడు పరుగెత్తి పారిపోగా ఆ చిరుత ఖేమారామ్‌ను చంపి తిన్నది. అటు, ఛాలి గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళను కూడా చిరుత పులి చంపింది. సెప్టెంబరు 8న ఝడోల్ సమీపంలో ఒక మహిళపై అది దాడి చేసింది.

మ్యాన్‌ ఈటర్‌గా మారిన చిరుత..! ముగ్గురిని చంపేసింది.. రోడ్డుపై బైఠాయించి గ్రామస్తుల ఆందోళన
Leopard Attack
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2024 | 9:39 PM

Share

అటవీ ప్రాంతం సమీపంలోని గ్రామాల్లో సంచరిస్తున్న ఓ చిరుత ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి చంపి తిన్నది. ఆ చిరుత నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. చిరుతను బందించాలని కోరుతూ హైవేను దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉండితాల్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల కమల అనే బాలిక, ఖేమారామ్‌ మరియు ఛాలి గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళ ఈ చిరుత దాడిలో మృతి చెందారని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో జరిగింది.

ఉదయ్‌పూర్‌ జిల్లాలోని ఉండితాల్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల కమల అనే అమ్మాయి మేకలు మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో గ్రామస్తులు అంతా గాలించారు. ఆ మరుసటి రోజున చిధ్రమైన ఆమె మృతదేహం అడవిలో కనిపించింది. మరోవైపు భెడియా నుంచి గ్రామానికి తిరిగి వస్తున్న ఖేమారామ్‌, అతడి కొడుకుపై చిరుత దాడి చేసింది. బాలుడు పరుగెత్తి పారిపోగా ఆ చిరుత ఖేమారామ్‌ను చంపి తిన్నది. అటు, ఛాలి గ్రామానికి చెందిన 50 ఏళ్ల మహిళను కూడా చిరుత పులి చంపింది. సెప్టెంబరు 8న ఝడోల్ సమీపంలో ఒక మహిళపై అది దాడి చేసింది.

చిరుత వరుస దాడుల నేపథ్యంలో ఆ చిరుత నరమాంస భక్షకిగా మారిందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. శుక్రవారం ఝడోల్, గోగుండ మధ్య రాష్ట్ర రహదారిని దిగ్భందించి నిరసన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్