వామ్మో.. ఒక్కసారిగా గొయ్యిలో పడిపోయిన ట్రక్కు.. డ్రైవర్ అదృష్టం బాగుంది..! షాకింగ్ వీడియో

సెప్టిక్ ట్యాంకర్‌ కాస్త ముందుకు కదలగానే అక్కడి భూమి కుంగిపోయింది. దీంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ వాహనంలో అందులో పడిపోయింది. వెంటనే స్పందించిన డ్రైవర్‌ వాహనం నుంచి బయటకు దూకి సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వామ్మో.. ఒక్కసారిగా గొయ్యిలో పడిపోయిన ట్రక్కు.. డ్రైవర్ అదృష్టం బాగుంది..! షాకింగ్ వీడియో
Pmc Vehicle Falls
Follow us

|

Updated on: Sep 20, 2024 | 9:19 PM

పూణేలోని సమాధాన్ చౌక్‌లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన ట్రక్కు నిలిచి ఉన్న పేవ్‌మెంట్‌ ఉన్నట్టుండి కుంగిపోవడంతో గోతిలో పడిపోయింది. డ్రైనేజీ క్లీనింగ్ పని కోసం అక్కడ ఆగివున్న ట్రక్కు ముందుకు కదిలింది. అంతలోనే అమాంతంగా భూమిలోకి కూరుకుపోయింది. ట్రక్కుతో పాటు రెండు బైకులు కూడా పడిపోయాయి. అదృష్టవశాత్తూ, ట్రక్కు డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరగింది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో పూణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కు చెందిన సెప్టిక్ ట్యాంక్ వాహనం సమాధాన్ చౌక్‌లోని సిటీ పోస్ట్ ఆవరణలో నిలిచి ఉంది. అక్కడి టాయిలెట్‌ను క్లీన్‌ చేసింది. అనంతరం వాహనాన్ని నడిపేందుకు డ్రైవర్‌ ప్రయత్నించాడు. సెప్టిక్ ట్యాంకర్‌ కాస్త ముందుకు కదలగానే అక్కడి భూమి కుంగిపోయింది. దీంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ వాహనంలో అందులో పడిపోయింది. వెంటనే స్పందించిన డ్రైవర్‌ వాహనం నుంచి బయటకు దూకి సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..