ఆ తండ్రికి ఎంత కష్టం.. కుమారుడికి రక్తం కోసం సైకిల్‌పై ఏకంగా 400 కి.మీ ప్రయాణం.. ఎక్కడంటే..?

Jharkhand man pedals 400km: తలసేమియా వ్యాధితో పోరాడుతున్న తనకుమారుడిని రక్షించుకోవడానికి ఓ తండ్రి ఏకంగా నాలుగు వందల కీలోమిటర్లు ప్రయాణించాడు. అది కూడా సైకిల్‌ను తొక్కుకుంటూ ప్రయాణించాడు. ప్రస్తుతం ఈ సంఘటన గురించి

ఆ తండ్రికి ఎంత కష్టం.. కుమారుడికి రక్తం కోసం సైకిల్‌పై ఏకంగా 400 కి.మీ ప్రయాణం.. ఎక్కడంటే..?
Jharkhand Man Pedals 400km
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 01, 2021 | 7:13 PM

Jharkhand man pedals 400km: తలసేమియా వ్యాధితో పోరాడుతున్న తనకుమారుడిని రక్షించుకోవడానికి ఓ తండ్రి ఏకంగా నాలుగు వందల కీలోమిటర్లు ప్రయాణించాడు. అది కూడా సైకిల్‌ను తొక్కుకుంటూ ప్రయాణించాడు. ప్రస్తుతం ఈ సంఘటన గురించి తెలుసుకొని షాకవుతున్నారు. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లా బ్లడ్ బ్యాంకులో రక్తం నిల్వలు లేకపోవడంతో ఆ తండ్రి తన ఐదున్నరేళ్ల కుమారుడిని కాపాడుకోవడం కోసం ఈ కష్టసాధ్యమైన పనికి పూనుకున్నాడు. కాంట్రాక్టు కార్మికుడైన దిలీప్ యాదవ్ (40) లాక్‌డౌన్ వల్ల తన ఉపాధిని కోల్పోయారు. తన ఐదున్నరేళ్ళ కుమారుడు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ బాలుడికి తరచూ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేయించాల్సి ఉంటుంది. తన కుమారునికి ఏ-నెగెటివ్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేయించవలసి ఉందని, అయితే గొడ్డా జిల్లా బ్లడ్ బ్యాంక్‌లో రక్తం అడిగితే లేదని చెప్పారని తెలిపాడు. తనకు ఉపాధి లేకపోవడం వల్ల సైకిల్‌పైనే తన కుమారుడిని తీసుకుని జమ్‌తారా ఆసుపత్రికి వెళ్లామని మీడియాతో చెప్పాడు.

తమ గ్రామం నుంచి ఆసుపత్రికి వెళ్ళి రావడానికి మొత్తం దూరం సుమారు 400 కిలోమీటర్లు ఉంటుందని తెలిపాడు. మే 25న బయల్దేరి, మే 27న జమ్‌తారా ఆసుపత్రికి చేరుకున్నామని వివరించాడు. మళ్లీ అటు నుంచి తమ గ్రామానికి రావడానికి రెండు రోజుల సమయం పట్టిందన్నాడు. రాత్రి వేళల్లో రోడ్లపక్కన బస్ స్టాపులు, చెట్ల కింద బస చేశామని తెలిపాడు.. గతంలో కూడా తాను తన కుమారుని కోసం ఇదేవిధంగా సైకిల్‌పై డుమ్కా, భాగల్పూరు వెళ్లినట్లు తెలిపాడు. లాక్‌‌డౌన్‌లో తనకు ఆదాయం లేనందువల్ల తాను వాహనాన్ని బుక్ చేసుకోలేకపోయానని చెప్పాడు దిలీప్ కుమార్. తాము ఢిల్లీలో పని చేసుకునేవారమని, ఫిబ్రవరిలో లాక్‌డౌన్ విధించడంతో తమ గ్రామానికి వచ్చినట్లు వెల్లడించాడు. ఢిల్లీలో ఉన్నపుడు రామ్ మనోహర్ లోహియా, సఫ్దర్ జంగ్ ఆసుపత్రుల్లో సులువుగా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసేవారని వెల్లడించాడు. తనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారని, ఆ కుమారునికి నెలకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేయించవలసి ఉంటుందని తెలిపారు.

మీడియాలో వచ్చిన కథనాల అనంతరం.. గొడ్డా జిల్లా బ్లడ్ బ్యాంక్ స్పందించింది. ఏ-నెగెటివ్ బ్లడ్ డోనర్ ఈ జిల్లాలో ఒకరే ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు ఒకసారి ఆ బాలునికి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేశామని, ఈసారి ఏ-నెగెటివ్ రక్తం లేకపోవడం వల్ల బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేయలేకపోయామంటూ ఓ అధికారి వెల్లడించారు.

Also Read:

5 States Assembly polls-2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం.. షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్ నిర్వహిస్తామన్న కేంద్ర ఎన్నికల సంఘం

బేఫికర్ ! కోవిద్ రూల్స్ కి ‘పాతర’…కూతురి ప్రీ-వెడ్డింగ్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే ‘జాతర’…60 మందిపై కేసు నమోదు

మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే