AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బేఫికర్ ! కోవిద్ రూల్స్ కి ‘పాతర’…కూతురి ప్రీ-వెడ్డింగ్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే ‘జాతర’…60 మందిపై కేసు నమోదు

మహారాష్ట్రలో ఓ బీజేపీ ఎమ్మెల్యే తన కూతురి ప్రీ-వెడ్డింగ్ పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు.ముంబైకి సుమారు 130 కి.మీ. దూరంలోని పింప్రి-చించినాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మహేష్ లాండ్ గే అనే ఈయన ఈ పార్టీకి..

బేఫికర్ !  కోవిద్ రూల్స్ కి 'పాతర'...కూతురి ప్రీ-వెడ్డింగ్ పార్టీలో బీజేపీ ఎమ్మెల్యే 'జాతర'...60 మందిపై కేసు నమోదు
Bjp Mla Accused Of Hosting Of Wedding Party For Daughter
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 01, 2021 | 6:55 PM

Share

మహారాష్ట్రలో ఓ బీజేపీ ఎమ్మెల్యే తన కూతురి ప్రీ-వెడ్డింగ్ పార్టీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు.ముంబైకి సుమారు 130 కి.మీ. దూరంలోని పింప్రి-చించినాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మహేష్ లాండ్ గే అనే ఈయన ఈ పార్టీకి దాదాపు 60 మంది గెస్టులను ఆహ్వానించాడు. పొలోమంటూ వచ్చిన వారంతా ఈ పార్టీలో డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఆదివారం సాయంత్రం ఈయన అట్టహాసంగా నిర్వహించగా..కోవిద్ రూల్స్ మాటేం చేశారంటూ అధికారులు విరుచుకపడ్డారు. కోవిద్ కారణంగా 25 మందికి మించకుండా గెస్టులను ఆహ్వానించారని అంటూ అందరిమీదా కేసు పెట్టారు. ఈ పార్టీలో చాలామంది మాస్కులు ధరించకపోగా భౌతిక దూరం ఊసు అంతకన్నా లేదు. మొత్తానికి రూల్స్ ని అతిక్రమించినందుకు ఈ ఎమ్మెల్యేపైనా ప్రధానంగా కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. కోవిద్ థర్డ్ వేవ్ కి అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులు సైతం వాటిని పట్టించుకోవడంలేదు.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 15,077 కోవిద్ కేసులు నమోదయ్యాయి. అయితే బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగానే ఉన్నాయని, ఆయా జిల్లాల్లోని అధికారులు ఈ రోగుల ప్రత్యేక చికిత్సపై దృష్టి పెట్టాలని ఉద్ధవ్ థాక్రే సూచించారు. అహమద్ నగర్ జిల్లాలో సుమారు ఎనిమిదివేలమంది పిల్లలు కోవిద్ వైరస్ కి గురయ్యారని తెలిసి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఇంచుమించు ప్రతిరోజూ సీఎంతో బాటు కేంద్రం కూడా కోవిద్ రూల్స్ ని ప్రజలు ఖచ్చితంగా పాటించాలని చెబుతున్నా అధికార పార్టీ నేతలే వాటికి గండి కొడుతున్నారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఓనర్స్‌ పనితో షాక్‌తిన్న కుక్కపిల్ల…నవ్వులే నవ్వులే ..వైరల్ అవుతున్న వీడియో : Dog funny video viral.

యూపీలో అనాముషం..డెడ్ బాడీ నదిలో పడేస్తూ వీడియోకు పోజులు ఇచ్చిన యువకులు: vial video.

Leopard catch Hyena Viral Vieo:హైనా ఆహారం కొట్టేసిన చిరుత..అంతలోనే షాకింగ్‌ సీన్‌!వైరల్ అవుతున్న వీడియో.