Amartya Sen: విమానాల్లో ఫ్రీగా తిరిగిన భారతరత్న అవార్డీ ఆయనొక్కరే.. ఎన్నిసార్లు ప్రయాణించారంటే..?
Bharat Ratna - Amartya Sen: భారతదేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. దీనిని సాధారణ అవార్డుల మాదిరిగా పరిగణించరు. ఈ అత్యున్నత పురస్కారన్ని ఇప్పటివరకూ 48 మందికి ఇచ్చారు. అందులో 14 మందికి చనిపోయిన
Bharat Ratna – Amartya Sen: భారతదేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం భారతరత్న. దీనిని సాధారణ అవార్డుల మాదిరిగా పరిగణించరు. ఈ అత్యున్నత పురస్కారన్ని ఇప్పటివరకూ 48 మందికి ఇచ్చారు. అందులో 14 మందికి చనిపోయిన తర్వాత ప్రదానం చేశారు. మిగిలిన 34 మందిలో ఇప్పటికీ నలుగురు మాత్రమే జీవించి ఉన్నారు. ఈ నలుగురులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, గానకోకిల లతా మంగేష్కర్, సైంటిస్ట్ సీఎన్ఆర్ రావ్, ఆర్థికవేత్త అమర్త్యసేన్ ఉన్నారు. అయితే.. మిగతా ఏ అవార్డుకూ లేని ఓ అవకాశం భారతరత్న అందుకున్న వారికి ఉంటుంది. వీళ్లు జీవితాంతం ఉచితంగా ఎయిరిండియా విమానాల్లో తిరగొచ్చు. 2003లో అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం భారతరత్న అవార్డీలను ఈ విధంగా గౌరవించాలని నిర్ణయం తీసుకుంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం ఒక్క భారతరత్న అవార్డీ మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఆ వ్యక్తి పేరు అమర్త్యసేన్. సమాచార హక్కు చట్టం కింద ఎయిరిండియా నుంచి ఇండియా టుడే ఈ విషయాన్ని రాబట్టింది.
నోబెల్ బహుమతి విజేత కూడా అయిన అమర్త్య సేన్ మాత్రమే 2015 నుంచి 2019 వరకూ 21 సార్లు ఇలా ఎయిరిండియా విమానాల్లో ఉచితంగా ప్రయాణించినట్లు ఆ సంస్థ పేర్కొంది. అయితే.. అమర్త్యసేన్ ప్రయాణించిన తేదీ, సమయం, టికెట్ ధర వివరాలను తాము స్టోర్ చేయలేదని పేర్కొంది. కావున ఈ ప్రయాణాల మొత్తం విలువను మాత్రం చెప్పలేమని ఎయిరిండియా స్పష్టంచేసింది. భారతరత్న అవార్డీలకు ఎకానమీ క్లాస్ టికెట్లను మాత్రమే జారీ చేస్తారు. అయితే.. ఇతర పన్నులను మాత్రం ఇండియన్ ఎయిర్‌లైన్స్ భరిస్తుంది. కాగా భారతరత్న పొందిన వారిలో అమర్థ్యసేన్ మాత్రమే ఉచితంగా ప్రయాణించిన వారి జాబితాలో నిలవడం గమనార్హం.
Also Read: