IPL 2022: మళ్లీ వైరల్ అవుతున్న ఐపీఎల్‌-6 సంఘటన.. లేడీ యాంకర్‌ని చంకనెత్తుకున్న కామెంటర్..!

IPL 2022: ఐపీఎల్ 2022కి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 26 నుంచి భారత్‌లో ఈ బిగ్ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో ప్రతి సంవత్సరం కొన్ని అద్భుతమైన

IPL 2022: మళ్లీ వైరల్ అవుతున్న ఐపీఎల్‌-6 సంఘటన.. లేడీ యాంకర్‌ని చంకనెత్తుకున్న కామెంటర్..!
Danny Morrison
Follow us
uppula Raju

|

Updated on: Mar 22, 2022 | 5:51 AM

IPL 2022: ఐపీఎల్ 2022కి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 26 నుంచి భారత్‌లో ఈ బిగ్ క్రికెట్ లీగ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌లో ప్రతి సంవత్సరం కొన్ని అద్భుతమైన సన్నివేశాలు కనిపిస్తాయి. అయితే ఈ లీగ్‌లో కొన్నిసార్లు వివాదాస్పద విషయాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఒక క్రికెట్‌ కామెంటర్ మరొక మహిళా యాంకర్‌ను బహిరంగంగా ఎత్తుకున్న సంఘటన గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆ సంఘటనకి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌మీడియాలో మళ్లీ వైరల్‌గా మారాయి. దాదాపు ప్రతి క్రికెట్ అభిమానికి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ గురించి తెలుసు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాఖ్యాతలలో అతను ఒకడు. కానీ మోరిసన్ ఒకసారి తన వింత చర్య కారణంగా వివాదాల్లో చిక్కుకున్నాడు. వాస్తవానికి 2013 IPL-6లో యాంకర్ కరిష్మా కోటక్‌ని ఎత్తుకున్నప్పుడు మోరిసన్ ట్రోల్‌ చేయబడ్డాడు. టీవీ షో ఎక్స్‌ట్రా ఇన్నింగ్ సమయంలో ఇద్దరూ గ్రౌండ్‌లో లైవ్ కామెంట్రీ చేస్తున్నారు. అప్పుడు అనుకోకుండా కరిష్మాను ఒక్కసారిగా ఒడిలోకి తీసుకున్నాడు. దీంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఈ విషయం తరువాత అతను చాలా ట్రోల్ అయ్యాడు.

డానీ మారిసన్ తన వన్డే క్రికెట్‌ భారత్‌పైనే అరంగేట్రం చేశాడు. 1987 ప్రపంచ కప్‌లో మోరిసన్ నాగ్‌పూర్‌లో భారత్‌పై అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో మోరిసన్ తన 10 ఓవర్లలో 69 పరుగులు ఇచ్చాడు. అయితే దీని తర్వాత 1994లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి కివీస్ బౌలర్‌గా నిలిచాడు. కపిల్ దేవ్, సలీల్ అంకోలా, నయన్ మోంగియాలకు అతను పెవిలియన్‌ను పంపించాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ ప్రస్తుత సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ మే 29న జరుగుతుంది. ప్రస్తుత టీ20 లీగ్ సీజన్ నుంచి 8 జట్లు కాకుండా 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. తొలి మ్యాచ్ సీఎస్‌కే, కేకేఆర్‌ల మధ్య జరగనుంది. గతేడాది ఫైనల్ కూడా ఈ రెండు జట్ల మధ్యనే జరగడం విశేషం.

Strangest Buildings: అలా ఎలా నిర్మించారబ్బా.. వింతైన కట్టడాలు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

Relationship: ఆ సమయంలో మహిళలకి, పురుషలకి ఉన్న తేడా అదే..!

Viral Picture: మీ కళ్లకి ఒక పరీక్ష..ఈ ఫొటోలో ఉన్న దానిని కనిపెడితే మీరు జీనియస్..!