OMG: ప్రపంచంలోని అత్యంత నిర్జన ప్రదేశం.. సముద్రం మధ్యలో.. చూస్తే వణుకుపుట్టాల్సిందే.. అక్కడ ఏముంటాయంటే?
Weird News: ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఇది నేటికీ శాస్త్రవేత్తలకు తలనొప్పిగానే మిగిలిపోయింది. ఈ రోజు అలాంటి ఒక స్థలం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇది ప్రపంచంలోనే అత్యంత నిర్జన ప్రదేశంగా పేరుగాంచింది. మీరు దీని గురించి చాలా అరుదుగా విని ఉంటారు. ఒక వ్యక్తి ఏదైనా నిర్జన ప్రదేశం చూస్తే.. అక్కడి నుంచి పారిపోవడం చూస్తుంటాం.

Odd New: ప్రకృతి సృష్టించిన ఈ ప్రపంచం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఇది నేటికీ శాస్త్రవేత్తలకు తలనొప్పిగానే మిగిలిపోయింది. ఈ రోజు అలాంటి ఒక స్థలం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇది ప్రపంచంలోనే అత్యంత నిర్జన ప్రదేశంగా పేరుగాంచింది. మీరు దీని గురించి చాలా అరుదుగా విని ఉంటారు. ఒక వ్యక్తి ఏదైనా నిర్జన ప్రదేశం చూస్తే.. అక్కడి నుంచి పారిపోవడం చూస్తుంటాం. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ నిర్జన ప్రాంతాలకు వెళ్లడం మానుకుంటారు. కానీ, ఈ రోజు మాట్లాడుకునే ప్రదేశం మాత్రం.. భూమి మీదే అత్యంత ఎడారి ప్రాంతం అని పిలుస్తున్నారు.
వేల కిలోమీటర్ల మేర మనుషుల జాడ లేని ప్రదేశం ఇది. ఇది ప్రపంచంలోనే అత్యంత నిర్జన ప్రదేశంగా పేరుగాంచింది. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు కూడా ఇక్కడికి ఇంకా చేరుకోలేకపోయారు. ఈ ప్రదేశంలో నిశ్శబ్దం తప్ప మరేమీ వినిపించదు.
1992లో హెర్వోజ్ లుకటేలా అనే సర్వే ఇంజనీర్ ఈ స్థలాన్ని కనుగొన్నారు. ఈ ప్రదేశంలో ఏ మానవుడు లేదా ఏ మొక్కలు నివసించవు. అంతరిక్షంలోని పాడైన ఉపగ్రహాన్ని వదలడానికి ఉపయోగించే స్థలంగా పేరుగాంచింది. వేల కిలోమీటర్ల మేర ఉపగ్రహాల శిథిలాలు ఇక్కడ ఉన్నాయని ఈ ప్రాంతాన్ని చూసిన వారు చెబుతున్నారు. సముద్రం మధ్యలో ఉన్న ఈ ప్రదేశాన్ని సముద్ర కేంద్రం అని కూడా అంటారు. ఈ ద్వీపానికి 2,700 కిలోమీటర్ల దూరంలో పొడి భూమి ఉంది.




ఈ ప్రదేశంలో మానవుడు లేదా వృక్షసంపద కూడా కనిపించదు. ఈ ప్రదేశంలో అత్యంత ప్రత్యేకత ఏమిటంటే ఈ స్థలంపై ఏ దేశానికి హక్కు లేదు. 1997 సంవత్సరంలో ఈ ప్రదేశంలో ఒక శబ్దం వినిపించింది. అది దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలో వినిపించింది. ఈ స్వరం విన్న శాస్త్రవేత్తల ఆత్మలు కూడా కదిలిపోయాయి. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ప్రదేశంలో నిరంతరం రాళ్ళు విరిగిపోతూనే ఉంటాయని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
