AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyberabad Traffic Police: బైక్ పిలియన్ రైడర్ దెబ్బకు సైబరాబాద్ పోలీసుల మతిపోయిందంతే.. ఏం కవరింగ్ సామీ..

Cyberabad Traffic Police: హెల్మెట్ పెట్టుకోండి.. సురక్షితంగా ఉండండి బాబోయ్ అని ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా..

Cyberabad Traffic Police: బైక్ పిలియన్ రైడర్ దెబ్బకు సైబరాబాద్ పోలీసుల మతిపోయిందంతే.. ఏం కవరింగ్ సామీ..
Traffic Police2
Shiva Prajapati
|

Updated on: Oct 28, 2021 | 5:37 PM

Share

Cyberabad Traffic Police: హెల్మెట్ పెట్టుకోండి.. సురక్షితంగా ఉండండి బాబోయ్ అని ట్రాఫిక్ పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. జనాల బుర్రల్లోకి ఏమాత్రం ఎక్కడం లేదు. పైగా చిత్ర విచిత్రమైన ప్రదర్శనలు ఇస్తున్నారు. అది చూసి పోలీసులు.. వీళ్లెవరండీ బాబూ అంటూ నిట్టూరుస్తున్నారు. అయితే, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ రూల్స్ పాటించడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసుల సామ, దండోపాయలను ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే.. మొదట పద్ధతిగా వివరించి చెబుతున్నారు. అయినా వినకపోతే జేబులకు చిల్లుపడేలా జరిమానాలు విధించి చుక్కలు చూపిస్తున్నారు.

అయితే, మీరేమన్నా చేసుకోండి.. మేము మాత్రం మారం.. మేమింతే.. అన్న రీతిలో జనాలు పోలీసులను లైట్ తీసుకుంటున్నారు. అందుకు నిదర్శనమే తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన ట్వీట్. హెల్మెట్ ధరించడంపై అవేర్‌నెస్ కల్పించడంలో భాగంగా హెల్మెట్‌తో తలను పూర్తిగా కవర్ చేయండంటూ పోలీసులు నినదించిన విషయం తెలిసిందే. మరి ఈ స్లోగన్‌‌ను ఎలా అర్థం చేసుకున్నారో ఏమో గానీ.. ఓ మహిళ పిలియన్ రైడర్.. తన తలను పూర్తిగా కవర్ చేసేశారు. అయితే, హెల్మెట్‌తో కాదు.. విచిత్రంగా కవర్‌తో కప్పేశారు. వీరి పిక్‌ను సైబరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు.. ట్వీట్ చేశారు. “హెల్మెట్‌తో తలని పూర్తిగా కవర్ చేయాలి గానీ.. కవర్‌నే హెల్మెట్‌గా వాడమనలేదు. హెల్మెంట్ ధరించండి. సురక్షితంగా ఉండండి.’’ అంటూ చురకలంటించారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మోటార్ వెహికిల్ చట్టం 1989 ప్రకారం.. బైక్‌పై ప్రయాణించే వారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. లేదంటే జరిమానా విధించడం జరుగుతుంది. అయితే, హెల్మెట్‌ ధరించడాన్ని చాలా మంది ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాలు కూడా విపరీతంగా జరుగుతండటం, ఆ ప్రమాదాల్లో బైకర్లే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతుండటంతో పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. హెల్మెట్ ధరించని వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించాలనే నిబంధనను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. హెల్మెట్ ధరించని వాహనదారులను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి ఫైన్ వేస్తున్నారు. కొత్తగా పిలియన్ రైడర్‌కు హెల్మెట్ ఉండాలనే నిబంధన తీసుకువచ్చారు. లేదంటే జేబు నుంచి డబ్బు విదుల్చుకోవాల్సిందే.

Also read:

Diamond Spectals Video: భారత మొఘల్‌ రాజుల వజ్రవైఢూర్యాల కళ్లద్దాలివి.! దీని విలువ వేలానికి..(వీడియో)

Ind Vs Pak: విరాట్ కోహ్లీ అలా అనడం బాధించింది.. జడేజా సంచలన వ్యాఖ్యలు..

Banana Benefits: ఆ టైంలో అరటి పండు తినకూడదా?.. అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు..! (వీడియో)