Viral Video: నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని చూడగా గుండె గుభేల్
చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి అనూహ్యంగా షాక్ తగిలింది. నీటిలో ఏదో నల్లటి ఆకారం కనిపించడంతో ఏముందా అని రాయి వెయ్యిగా.. ఓ భారీ మొసలి బయటపడింది. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓసారి లుక్కేయండి.

వేసవి కాలం వచ్చిందంటే గ్రామాల్లోని చెరువులు గుంటలను ఆశ్రయిస్తారు. వాటిలో ఈత కొడుతూ వేసవి తాపంనుంచి ఉపశమనం పొందుతారు. అంతేకాదు స్విమ్మింగ్ ఇష్టపడేవారు ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. ఒక్కోసారి ప్రమాదాల్లో కూడా పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. అతను ఊహించని విధంగా చెరువులో భారీ మొసలి కనిపించడంతో దెబ్బకు అక్కడినుంచి భయంతో పారిపోయాడు.
నీటితో నిండి ఉన్న ఓ చెరువు వద్దకు ఓ వ్యక్తి వెళ్లాడు. చెరువులోని నీరు ఎండపడి మెరుస్తూ కనిపిస్తోంది. పైన ఎండ… పక్కనే చెరువులో చల్లని నీళ్లు.. అతనికి చెరువులో ఈతకొట్టాలనిపించింది. వెంటనే చెరువులోకి దిగడానికి రెడీ అయ్యాడు. మళ్లీ ఎందుకో ఆలోచించి కాసేపు గట్టుపైనే కూర్చుని నీళ్లను చూస్తూ ఉన్నాడు. పక్కనే ఓ రాయి కనిపించడంతో దానిని నీటిలోకి విసిరాడు. రాయి నీళ్లలో పడగానే.. లోపలి నుంచి ఓ పెద్ద మొసలి అమాంతం పైకి లేచి నోరు తెరిచింది. అప్పటికదాకా నీళ్లను చూస్తూ ఎంజాయ్ చేసిన ఆ వ్యక్తి ఊహించని పరిణామానికి షాకయ్యాడు. దెబ్బకు అక్కడినుంచి దూరంగా వచ్చేశాడు. నీళ్లే కదా అని పొరపాటున అందులోకి దిగి ఉంటే.. నాపని హరీ… అమ్మబాబోయ్.. అనుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను దాదాపు 2 మిలియన్లమందికి పైగా వీక్షించారు. 9 వేలమంది లైక్ చేశారు. వామ్మో ఈ మొసలి తెలివి మామూలుగా లేదుగా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
What lies beneath
— Science girl (@gunsnrosesgirl3) April 3, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
