జపాన్ టూరిస్టుల నుంచి పోలీసుల లంచం.. కట్ చేస్తే.. చివర్లో బిగ్ ట్విస్ట్..
ఆ రోడ్డుపై తమతో పాటుగా చాలా మంది హెల్మెట్ లేని వాళ్లు వెళ్తున్నారని, కానీ, పోలీసులు వారిని అడ్డగించలేదని చెప్పారు. కానీ, తమను మాత్రమే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పెద్దసంఖ్యలో డిమాండ్ చేశారు.

దేశంలో ఇప్పుడు లంచం లేకుండా ఏ పని జరగడం లేదు. ప్రభుత్వ, ప్రైవేటు ఎక్కడైనా సరే..అధికారుల చేతులు తడపాల్సిందే. ఈ క్రమంలోనే జపాన్ టూరిస్టుల నుంచి గురుగ్రామ్ పోలీసులు లంచం డిమాండ్ చేయడం ఇంటర్‌నెట్ వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు అధికారులు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అయిన తర్వాత ఉన్నతాధికారులు ఈ చర్య తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
వైరల్ వీడియోలో పోలీసులు రసీదు లేకుండా జపనీస్ పర్యాటకుడి నుండి రూ. 1000 లంచం తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను కాటో అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది అతి వేగంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
జపాన్‌కు చెందిన ఒక యువతి, మరో వ్యక్తితో కలిసి గురుగ్రామ్ లో స్కూటీపై వెళ్తున్నారు. ఇంతలో స్థానిక ట్రాఫిక్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్కూటీ వెనక సీటుపై ఉన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోనందుకు జరిమానా చెల్లించాలని అన్నారు. దీనికి వారు.. వీసా కార్డుతో చెల్లించొచ్చా అని జపాన్ టూరిస్టులు అడుగుతున్నారు. కానీ, అందుకు అంగీకరించని పోలీసులు నగదు చెల్లించాలని చెప్పారు. దాంతో సదరు టూరిస్టు రెండు రూ.500 నోట్లను తీసి ఓ పోలీసుకు ఇచ్చారు. అందుకుగానూ ఆ అధికారులు వారికి కనీసం రసీదు కూడా ఇవ్వలేదు.
వీడియో ఇక్కడ చూడండి..
🚨 Zero Tolerance Against Corruption 🚨
In line with our commitment to transparency and accountability, DCP Traffic, Gurugram, has taken immediate action:
🔴 Suspended with immediate effect: • ZO ESI Karan Singh (No. 704/GGM) • Ct. Shubham (No. 4061/GGM) • HGH Bhupender (No.…
— Gurugram Traffic Police (@TrafficGGM) September 1, 2025
కానీ, ఈ సంఘటన మొత్తాన్ని వారు వీడియో తీసుకున్నారు. అది కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అంతేకాదు..జపాన్ టూరిస్టులు మరో విషయం కూడా చెప్పారు. ఆ రోడ్డుపై తమతో పాటుగా చాలా మంది హెల్మెట్ లేని వాళ్లు వెళ్తున్నారని, కానీ, పోలీసులు వారిని అడ్డగించలేదని చెప్పారు. కానీ, తమను మాత్రమే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. సంబంధిత ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పెద్దసంఖ్యలో డిమాండ్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




