AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rate Today: భగ్గుమంటున్న బంగారం…ఏకంగా లక్షా పదివేలకు చేరువగా పరుగులు..! తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే..

24 క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం. దీనిని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇకపోతే, 22 క్యారెట్ల బంగారం, 18 క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్షా పదివేల రూపాయల చేరువకు వచ్చేసింది. బంగారం ధర విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Gold Rate Today: భగ్గుమంటున్న బంగారం...ఏకంగా లక్షా పదివేలకు చేరువగా పరుగులు..! తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే..
Gold Rate
Jyothi Gadda
|

Updated on: Sep 03, 2025 | 7:10 AM

Share

బాబోయ్‌ బంగారం భగ్గుమంటోంది. సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతోంది. ఆగస్టు నెల చివరి పది రోజుల్లోనే భారతదేశంలో బంగారం ధర 100 గ్రాములకు రూ. 30,000 కంటే ఎక్కువ పెరిగింది. ఇది ఇటీవలి నెలల్లో జరిగిన అతిపెద్ద ర్యాలీలలో ఒకటి అని పలువురు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.. వచ్చే సీజన్‌కు ముందు ఎక్కువ మంది బంగారం, వెండిని కొనుగోలు చేస్తారనే అంచనాలు ప్రధానంగా బంగారం ధరలు పెరగడానికి కారణం. అంతేకాదు.. దసరా, దీపావళి వంటి పండుగలు వస్తున్నందున వినియోగదారుల డిమాండ్ పెరగడం వల్ల భారతదేశంలో బంగారం ధరలు చారిత్రాత్మక స్థాయికి పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం అత్యంత ఖరీదైన బంగారం. దీనిని సాధారణంగా పెట్టుబడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇకపోతే, 22 క్యారెట్ల బంగారం, 18 క్యారెట్ల బంగారం ప్రధానంగా ఆభరణాల కోసం ఉపయోగిస్తారు. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర లక్షా పదివేల రూపాయల చేరువకు వచ్చేసింది. బంగారం ధర విపరీతంగా పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే కారణమని చెప్పవచ్చు.

సెప్టెంబర్ మూడవ తేదీ బుధవారం బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,06,100లకు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.97,260లుగా ఉంది. 18 క్యారెట్లతో ఉండే 10గ్రాముల బంగారం ధర రూ. 79,580లు పలుకుతోంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,06,250లుగా ఉంది. అదే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.97,410లుగా ఉంది.

ఇవి కూడా చదవండి

– ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,06,100లుగా ఉంది. అదే 22 క్యారెట్ల ధర రూ.97,260 ఉంది.

– చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,06,100ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.97,260 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,06,100లు ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.97,260 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ.1,06,100 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.97,260 లుగా ఉంది.

– విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,06,100 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.97,260 లుగా ఉంది.

ఇక, ఇవాళ్టి వెండి ధర విషయానికి వస్తే.. పసిడితో పాటుగానే వెండి కూడా పరుగులు పెడుతోంది. వెండి గ్రాము ధర రూ.136.20లు ఉండగా, కిలో వెండి ధర రూ. 1,36,200లు ధర పలుకుతోంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం