AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నల్లని బొగ్గు గనుల్లో తెల్లని శ్వేత నాగు హల్‌చల్‌.. చూస్తుండగానే మాయం..! అరుదైన వీడియో వైరల్

ముఖ్యంగా నెటిజన్లు ఎక్కువగా పాముల వీడియోలను తెగ ఆసక్తితో చూస్తుంటారు.. ఎక్కడ పాములు కనిపించినా కూడా తమ ఫోన్‌లలో వీడియోలు రికార్డ్‌ చేయడం, ఆ వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. దీంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక్కడ కూడా అలాంటిదే ఒక అరుదైన శ్వేత నాగు వీడియో వైరల్‌ అవుతోంది.

Viral Video: నల్లని బొగ్గు గనుల్లో తెల్లని శ్వేత నాగు హల్‌చల్‌.. చూస్తుండగానే మాయం..! అరుదైన వీడియో వైరల్
White Colour Snake
Jyothi Gadda
|

Updated on: Sep 03, 2025 | 7:59 AM

Share

వైరల్‌ వార్తలు, వీడియోలకు అడ్డా సోషల్ మీడియా. ఇక్కడ ప్రతి రోజూ కొన్ని వందలు, వేల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వైరల్‌ వీడియోలు మనుషులకు సంబంధించినవి, చిన్న పిల్లలకు చెందినవి కూడా ఉంటాయి. అలాగే, అడవి జంతువుల వీడియోలు కూడా ఎక్కువగా వైరల్‌ అవుతున్నాయి. వాటిలో ఏనుగులు,పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, పాముల వీడియోలు కూడా ఉంటాయి. ముఖ్యంగా నెటిజన్లు కూడా ఎక్కువగా పాముల వీడియోలను తెగ ఆసక్తితో చూస్తుంటారు.. ఎక్కడ పాములు కనిపించినా కూడా తమ ఫోన్‌లలో వీడియోలు రికార్డ్‌ చేయడం, ఆ వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు. దీంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక్కడ కూడా అలాంటిదే ఒక అరుదైన శ్వేత నాగు వీడియో వైరల్‌ అవుతోంది.

ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియో సంఘటన తమిళనాడులోని నైవేలీ బొగ్గు గనుల్లో కనిపించిన అరుదైన దృశ్యంగా తెలిసింది. నల్లటి బొగ్గు గనుల్లో తెల్లటి శ్వేతనాగు పరుగులు తీస్తున్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. చుట్టూ నల్లటి వాతావరణంతో కూడిన బొగ్గులో శ్వేత నాగు తిరుగుతూ హల్ చల్ చేస్తుంది. గనుల్లో పనిచేస్తున్న కొంతమంది కార్మికులు శ్వేతనాగును గమనించి తమ ఫోన్ లలో వీడియో తీశారు. చూస్తుంటే ఆ పాము దాదాపుగా 15 అడుగుల పొడవు ఉన్నట్టుగా తెలిసింది. అయితే, ఇంతకీ ఆ బొగ్గుగనుల్లోకి ఆ శ్వేత నాగు ఎలా వెళ్లిందో మాత్రం తెలియదు. కానీ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

నైవేలీ బొగ్గు గనుల ప్రాంతం చుట్టు దట్టమైన అడవి ఉందని తెలిసింది. ఆ అడవిలోంచి దారితప్పి వచ్చిన శ్వేతనాగు గనుల్లోకి వెళ్లి ఉంటుందని కొంత మంది భావిస్తున్నారు. కాగా, వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భిన్నమైన కామెంట్స్‌ చేశారు. కొందరు షాకింగ్‌ రియాక్షన్స్‌ ఇస్తుండగా, మరికొందరు అరుదుగా ఉండే శ్వేత నాగు కనిపించటం వారి అదృష్టంగా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆ బొగ్గుగనిలో శ్వేతనాగు కనిపించడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే