AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: రిసెప్షన్‌ హాల్‌లోకి అంబులెన్స్‌.. స్ట్రెచ్చర్‌పై తెచ్చిన దాన్ని చూసి బంధువులంతా షాక్.. ఇంతకు ఏంటది?

అంతా పెళ్లి రిసెప్షన్‌ హడావుడిలో ఉంటే.. అప్పుడే సైరెన్‌ వేసుకొని అక్కడికి ఓ అంబులెన్స్‌ వచ్చింది. ప్రశాంతంగా సాగుతున్న పెళ్లి వేడుకలో అంబులెన్స్‌ ఏంటా అని అంతా తెగ భయపడిపోయారు. కొద్దిసేపటి తర్వాత అసలు విషయం తెలుసుకుని కూల్‌ అయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?.. అంబులెన్స్‌ ఎందుకు వచ్చింది? తెలుసుకుందాం పదండి.

Watch Video: రిసెప్షన్‌ హాల్‌లోకి అంబులెన్స్‌.. స్ట్రెచ్చర్‌పై తెచ్చిన దాన్ని చూసి బంధువులంతా షాక్.. ఇంతకు ఏంటది?
Huderabad Viral Video
Noor Mohammed Shaik
| Edited By: Anand T|

Updated on: Sep 03, 2025 | 7:03 AM

Share

హైదరాబాద్ నగరంలోని గుడిమల్కాపూర్‌ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి రిసెప్షన్‌ వేడుక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక పెద్ద ఫంక్షన్‌ హాల్‌లో వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రులంతా పెద్ద సంఖ్యలో వచ్చారు.ఆ ప్రాంతమంతా ఎంతో సందడిగా ఉంది, మంచి మ్యూజిక్‌తో అంతా ఎంజాయ్‌ చేస్తున్నారు. అంతలో అక్కడ ఒక్కసారిగా సౌండ్‌ ఆగిపోయింది. అందరూ బయటికి వచ్చి చూస్తే షాకింగ్‌ ఘటన కనిపించింది. పెద్దగా సైరన్ మోగిస్తూ ఓ అంబులెన్స్ ఫంక్షన్‌ హాల్‌ గేటు దగ్గరికి వచ్చి ఆగింది. అందులోంచి తెల్లటి వస్త్రంతో కప్పిన ఓ స్టెచర్‌ను కిందకి దించారు యువకులు.

అది చూడగానే అక్కడున్నవారంతా కంగారుపడ్డారు. శుభకార్యంలో ఈ విధంగా అంబులెన్స్ రావడమే కాక, స్టెచర్‌పై ఏదో మృతదేహం ఉందేమో అనే అనుమానంతో అలా చూస్తూ ఉండిపోయారు. యువకులు స్టెచర్‌ను కిందకి దించి అలాగే ఫంక్షన్‌ హాల్‌లోకి తీసుకెళ్లారు. పెళ్లికొడుకుతో పాటు లోపలున్నవారంతా ఉలిక్కిపడ్డారు. ఎవరికేం జరిగిందో అంటూ కాస్త కంగారు పడ్డారు కూడా. అయితే కొద్ది క్షణాల్లోనే అసలు విషయం బయటపడింది. అదేంటంటే..పెళ్లి కొడుకు కోసం తీసుకొచ్చిన దండను ఇలా వెరైటీగా స్టెచర్‌పై తీసుకొచ్చి సర్‌ప్రైజ్‌ చేశారు స్నేహితులు. ఇది పెళ్లికొడుకు స్నేహితులు చేసిన ఓ ప్రాంక్ అని తేలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదంతా తెలుసుకున్న బంధువులు ప్రశాంతంగా సాగుతున్న పెళ్లి వేడుకలో ఈ చావు గోల ఏంట్రా అంటూ తలలుపట్టుకున్నారు. దీనికి నెటిజన్ల నుండి తీవ్ర ప్రతికూల స్పందన వస్తోంది. శుభకార్యాల్లో ఇలాంటి అశకునపు పనులు కలలో కూడా చేయొద్దని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం తమకు ముందే అనుమానం వచ్చిందని, ఎందుకంటే అంబులెన్స్‌లో స్టెచర్‌ వస్తే పక్కన ఉన్న బ్యాండ్‌ బృందం మాత్రం ఉత్సాహంగా వాయిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారని అంటున్నారు. అంబులెన్స్‌ను అత్యవసరం కోసం ఉపయోగించాలి కానీ ఇలాంటి ఆకతాయి పనులకు కాదంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..