AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: కాసేపట్లో పెళ్లి.. సడెన్‌గా మండపంలోకి అంబులెన్స్ ఎంట్రీ.. ఎందుకో తెలిస్తే ఫ్యూజులౌట్!

కాసేపట్లో పెళ్లి. తాళికట్టే సమయం సమీపిస్తోంది. సడెన్‌గా అంబులెన్స్ వచ్చి ఆగింది. సినిమా సీన్లకు ఏమాత్రం తీసిపోని ట్విస్ట్ ఇది...

Viral News: కాసేపట్లో పెళ్లి.. సడెన్‌గా మండపంలోకి అంబులెన్స్ ఎంట్రీ.. ఎందుకో తెలిస్తే ఫ్యూజులౌట్!
Viral 11
Ravi Kiran
|

Updated on: Mar 05, 2022 | 12:47 PM

Share

కాసేపట్లో పెళ్లి. తాళికట్టే సమయం సమీపిస్తోంది. సడెన్‌గా అంబులెన్స్ వచ్చి ఆగింది. సినిమా సీన్లకు ఏమాత్రం తీసిపోని ట్విస్ట్ ఇది. అంబులెన్స్ ఎందుకు వచ్చిందో తెలుసా?

పెళ్లి మండపానికి వరుడు ఎలా వస్తాడు. దర్జా ఒలకబోస్తూ కారులోనో, అంబారీపైనో, గుర్రంపైనో వస్తాడు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన పెళ్లి వేడుకలో ఇవేవీ కాదు. అంబులెన్స్‌లో వచ్చాడు. పెళ్లికి వచ్చినవాళ్లంతా షాక్‌ అయ్యారు. అసలు పెళ్లి మండపంలోకి అంబులెన్స్‌ రావడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. అంబులెన్స్‌ దగ్గరకు పరుగు పరుగున వచ్చారు. నూతన వస్త్రాలు కట్టుకుని, కళ్లజోడు ధరించి, బూట్లు వేసుకున్న యువకుడు కనిపించాడు.

తీరా చూస్తే అతనే పెళ్లి కొడుకు రాహుల్ కటారియా. అంబులెన్స్‌ లోపల వరుడ్ని చూసి అంతా షాక్‌ అయ్యారు. ఇదేదో పబ్లిసిటీ కోసమో, కొత్తదనం కోసమో చేసింది కాదు. పెళ్లి మండపానికి ఇలా రావాల్సి వచ్చింది. పెళ్లికి ఐదు రోజుల ముందు జరిగిన ప్రమాదంలో రాహుల్‌ కటారియా కాలు విరిగింది. దీంతో ట్రీట్‌మెంట్ తీసుకున్నాడు. అహ్మదాబాద్‌లో ఆపరేషన్‌ చేసి కాలికి కట్టు కట్టారు వైద్యులు. సరిగా నడవలేని పరిస్థితిలో అంబులెన్స్‌లో నేరుగా కళ్యాణ మండపానికి వచ్చేశాడు అబ్బాయి.

Viral

స్ట్రెచర్‌పై స్టేజ్‌ మీదకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. పెద్దలు నిర్ణయించిన ముహుర్తానికి అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేయాలని ఇలా డిసైడయ్యాడు. పెళ్లికి ముందు యాక్సిడెంట్ జరగడం మంచిది కాదనో, మరో ముహూర్తం పెట్టుకుందానో అనుకోకుండా.. సహృదయంతో అంబులెన్స్‌లో వివాహ వేదికకు వచ్చిన వరుడ్ని అక్కడున్నవారంతా అభినందించారు. పెళ్లికూతురు మస్త్ ఇంప్రెస్ అయింది. త్వరలోనే గాయం నయం అవుతుందని.. అప్పుడు అందరితో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేషన్‌ చేసుకుంటామని నూతన వధూవరులు చెప్పారు.

Also Read:

Viral Photo: ఈ ఫోటోలో పామును కనిపెట్టండి చూద్దాం.. కష్టం కాదండోయ్.!

Viral Video: నీటిలో నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

Viral Video: లైకుల కోసం మరీ ఇంతలా.! ఈ పిల్ల చేసిన పనికి ఫ్యూజులు ఎగరాల్సిందే!

Viral 1

థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..