Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీటిలో నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

మనకు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు తారసపడుతుంటాయి. అందులో కొన్ని మన మనసుకు హత్తుకునే విధంగా ఉంటే..

Viral Video: నీటిలో నల్లటి ఆకారం.. చేప అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!
Kriti Sanon New Photos. Credit by:Kriti Sanon/Twitter
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 04, 2022 | 1:44 PM

మనకు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు తారసపడుతుంటాయి. అందులో కొన్ని మన మనసుకు హత్తుకునే విధంగా ఉంటే.. మరికొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిని చూసిన తర్వాత అస్సలు మీ కళ్లను మీరే నమ్మలేరు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దాన్ని చూశాక ఒక్కసారిగా మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.

వైరల్ వీడియో ప్రకారం.. మీ నీటిపైన ఓ నల్లటి ఆకారం కదులుతున్నట్లు చూడవచ్చు. ఏదైనా సొరచేప, లేదా చేప అయి ఉంటుందని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. కొంచెం ఆ వీడియోను ముందుకు ఫార్వర్డ్ చేయండి. అదేంటో మీకే తెలుస్తుంది… చూశారా.! అదొక పెద్ద మొసలి.. ఛాన్స్ దొరికితే మనల్నే నమిలి మింగేస్తుంది. అంతటి మొసలిని ట్రైనర్లు ఫుడ్‌ను ఎరగా వేస్తూ ఉసుగొలుపుతుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

View this post on Instagram

A post shared by Nature Sms (@naturesms)

కాగా, ఈ వీడియోను ‘naturesms’ అనే ఇన్‌స్టా పేజీ వారం రోజుల క్రితం అప్‌లోడ్ చేయగా.. ఇప్పటివరకు 8.35 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.