Cooking Oil: సౌత్ ఇండియన్స్ ఆయిల్ ఎంత వాడతారు.. ధరల పెరుగుదలలో వార్ ఎఫేక్ట్ ఎంత.. పూర్తి వివరాలు..

Cooking Oil: సౌత్ ఇండియన్స్ ఆయిల్ ఎంత వాడతారు.. ధరల పెరుగుదలలో వార్ ఎఫేక్ట్ ఎంత.. పూర్తి వివరాలు..
Sunflower Oil

Cooking Oil: నూనె లేకపోతే మనం బతకలేం. సౌత్ ఇండియా(South India)లో ప్రజలు అస్సలు బతకలేరు. ఎంతగా అంటే ఒక్కో మనిషి ఏడాదికి సగటున వాడే నూనె గణాంకాలు తెలుసుకోండి.

Ayyappa Mamidi

|

Mar 04, 2022 | 2:01 PM

Cooking Oil: నూనె లేకపోతే మనం బతకలేం. సౌత్ ఇండియా(South India)లో ప్రజలు అస్సలు బతకలేరు. ఎంతగా అంటే ఒక్కో మనిషి ఏడాదికి సగటున 16 లీటర్ల వంట నూనె వాడతారని గణాంకాలు చెబుతున్నాయి. సో.. వంటనూనెల మార్కెట్ అనేది భారత్ లో చాలా పెద్ద బిజినెస్. ఇప్పుడు ఉక్రెయిన్- రష్యా వార్‌తో ఆ బిజినెస్‌ అక్రమంగా మారిపోయింది. ఈ తరుణంలో భారత ఆయిల్ దిగుమతుల వివరాలను ఒకసారి గమనిద్దాం రండి.. దేశంలో 65 శాతం సన్‌ఫ్లవర్‌, పామాయిల్ వాడకం ఉంటుంది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌(Sunflower Oil)లో కూడా 20% వరకూ సోయా, పామాయిల్(Palm Oil) లను కలుపుతుంటారు. మన దగ్గర ఉన్న వాడకానికి, సప్లైకి విపరీతమైన వ్యత్యాసం ఉండడంతో.. ఇతర దేశాలపై ఆధారపడక తప్పటం లేదు.  2021 లో దిగుమతి చేసుకున్న మొత్తం వంట నూనెలు 135.31లక్షల టన్నులుగా ఉంది. కరెన్సీ రూపంలో చెప్పాలంటే దాని విలువ 1.17లక్షల కోట్లు అన్నమాట. ఇందులో 18.94 లక్షల టన్నులు సన్‌ఫ్లవర్ ఆయిల్‌, మరో 48.12లక్షల టన్నులు పామాయిల్ ఉన్నాయి.

దేశంలో ఎక్కువమంది వినియోగించే సన్‌ఫ్లవర్ నూనెను అత్యధికంగా మనం ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒక్క రష్యా, ఉక్రెయిన్ నుంచే 76% దిగుమతులు ఉన్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ – రష్యా నుంచి ఇంపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి.. ఆ యుద్ధాన్ని బూచిగా చూపించి, దిగుమతిపై ప్రభావం లేకుండానే కిరాణా వ్యాపారస్తులు.రేట్లను పెంచేశారు.

దీనికి తోడు దేశంలో బ్లాక్ మార్కెట్ అనేది పెద్ద సమస్యగా ఉంది. భవిష్యత్‌లో ఫలానా వస్తువు రేట్లు పెరగొచ్చు అని అంచనాలు వస్తే చాలు.. ఇప్పుడే బ్లాక్ చేసి, రేటు పెంచేసి చూపిస్తారు వ్యాపారస్తులు. వాస్తవానికి జీఎస్టీ వచ్చాక.. ఇలాంటి అక్రమాలు జరగకూడదు. ఎందుకంటే అక్రమంగా స్టాక్ చేసి పెడుతున్న సరుకును కనిపెట్టేస్తారన్నది చట్టంలో ఉన్న మాట. కానీ సిస్టమ్ ఫెయిల్యూర్ అనాలో.. మరేదైనా సమస్య అనాలో గానీ.. అక్రమంగా దాచిపెడుతున్న సరుకును కనిపెట్టలేకపోతున్నారు. పైగా.. రిటైల్ షాపుల్లో రేట్లు పెంచి కనిపిస్తున్నాయి గానీ.. వాస్తవానికి ఆయిల్ రేట్లు డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలోనే పెంచేస్తున్నారు. ఫలితంగా రిటైల్ షాపుల్లోనూ ఆ మేరకు రేట్లు పెంచక తప్పడంలేదటున్నారు రిటైల్ వ్యాపారులు.

ఇలా రేట్లు అడ్డగోలుగా పెంచుకుంటూ పోతుంటే ప్రతికుటుంబానికి ఆర్థికంగా ఇబ్బందే. అదే ఆరోగ్యంపైనా ప్రభావం. ఎప్పుడైతే అక్రమ స్టాక్ కారణంగా, లేదంటే నిజంగానే సప్లై తగ్గి డిమాండ్ పెరిగినా రేట్లు అమాంతం పెరుగుతాయి. దాన్ని ఆసరాగా తీసుకుని కల్తీ కూడా పెరిగిపోతుంది. ఎప్పుడైతే కల్తీ పెరిగిందో ప్రభావం ఆరోగ్యాలపై పడుతుంది. వాడిన ఆయిల్ ను కండిషన్ చేసి మళ్లీ వాడుతుంటారు. ఇలాంటివి తినటం ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇలాంటి కల్తీల కారణంగా క్యాన్సర్లు సహా అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై అధికారులు శ్రద్ధ పెంచి కల్తీని అరికట్టటం ప్రస్తుత సమయంలో చాలా ముఖ్యమైనది.

ఇవీ చదవండి..

LIC IPO Alert: ఎల్ఐసీ ఐపీవో వాయిదా.. మరి మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది.. ప్రభుత్వ వర్గాల మాటేంటి..

EV Charging Station: అక్కడ 121 కార్లకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టొచ్చు..! దాని స్పెషాలిటీలు మీ కోసం..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu