AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Offers : పొదుపు చేయాలను కుంటున్నారా? ఈ బ్యాంకుల్లో ఇంట్రస్ట్ రెండింతలు వస్తుంది..

రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అన్నీ రంగాలపైనా పడుతుంది. ఇక ఈ యుద్ధం కారణంగా సామాన్యుల ఆదాయం పై పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

Bank Offers : పొదుపు చేయాలను కుంటున్నారా? ఈ బ్యాంకుల్లో ఇంట్రస్ట్ రెండింతలు వస్తుంది..
Bank
Rajeev Rayala
|

Updated on: Mar 04, 2022 | 7:04 PM

Share

Bank Offers : రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అన్నీ రంగాలపైనా పడుతుంది. ఇక ఈ యుద్ధం కారణంగా సామాన్యుల ఆదాయం పై పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మిగులు ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు ఖాతాలలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు పొదుపు ఖాతాలలోని డిపాజిట్ల నుండి వడ్డీ ఆదాయాన్ని కూడా పొందుతారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లు పడిపోతున్నాయి. ఈ పరిణామాల మధ్య  బ్యాంక్ బజార్ సర్వే ప్రకారం.. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి.  కొత్త రిటైల్ కస్టమర్లను పొందేందుకు ప్రముఖ ప్రైవేట్ , ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ముందు ఆ బ్యాంకులకు సంబంధించిన పూర్తివివరాలు, వాటి బ్రాంచ్ లకు సంబంధించిన వివరాలు, అలాగే ATM సేవల గురించి తెలుసుకోవాలి. పొదుపు ఖాతాలపై ఉత్తమ వడ్డీ రేట్లను అందించే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం..

AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సేవింగ్స్ ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ. 2,000 నుండి రూ. 5,000 ఉండాలి. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అదేవిధంగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ కూడా పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ.2,500 నుండి రూ.10,000 ఉండాలి. ఇక DCB బ్యాంక్ పొదుపు ఖాతాలపై 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ప్రైవేట్ బ్యాంకులలో, ఈ బ్యాంక్ ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది. మినిమమ్  రూ.2,500 నుంచి రూ.5,000 బ్యాలెన్స్ మన అకౌంట్ లో ఉండాలి. అలాగే ఆర్‌బిఎల్ బ్యాంక్ పొదుపు ఖాతాలపై 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ. 2,500 నుండి రూ. 5,000 ఉండాల్సి ఉంటుంది. బ్యాంక్ బజార్ ఫిబ్రవరి 16, 2022 నాటికి ఈ డేటాను సేకరించింది. సాధారణ పొదుపు ఖాతా కోసం మినిమం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతా మాత్రమే దీనికోసం పరిగణిస్తారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Cooking Oil: సౌత్ ఇండియన్స్ ఆయిల్ ఎంత వాడతారు.. ధరల పెరుగుదలలో వార్ ఎఫేక్ట్ ఎంత.. పూర్తి వివరాలు..

LIC IPO Alert: ఎల్ఐసీ ఐపీవో వాయిదా.. మరి మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది.. ప్రభుత్వ వర్గాల మాటేంటి..

EV Charging Station: అక్కడ 121 కార్లకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టొచ్చు..! దాని స్పెషాలిటీలు మీ కోసం..

'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
'నా నడుముపై చేయి వేసి'.. బిగ్ బాస్ తెలుగు బ్యూటీకి చేదు అనుభవం
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
షుగ‌ర్ ఉన్న‌వారు సపోటా తింటే ఏమౌతుందో తెలుసా? డాక్టర్స్‌ చెప్పేది
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
అరటి పండు Vs జామ పండు: ఉదయాన్నే ఏది తింటే ఆరోగ్యానికి మంచిది..?
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
ఇన్నాళ్లు తమ పొట్ట నింపిన తాటి చెట్టు పైనుంచే.. అనంత లోకాలకు
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
తొలి మ్యాచ్‌కు ముందే దిమ్మతిరిగే షాక్.. ఆడకుండానే పాక్ ఔట్..?
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
జియో హాట్ స్టార్‌ను వదలని ప్రభాస్ ఫ్యాన్స్..!
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
ఫోన్‌లో స్టోరేజ్‌ ఫుల్‌ అయిందా? ఇలా చేయండి 2TB ఫ్రీ
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
శని, శుక్ర సంయోగం.. వీరికి అలర్ట్.. మొండితనం విడిచి పెట్టాల్సిందే
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
భారత్ - అమెరికా చారిత్రాత్మక ఒప్పందం.. మన రైతులకు, వ్యాపారులకు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..
టీ20 ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలో తళుక్కున మెరవనున్న తారలు..