Viral Video: బుజ్జి.. బుజ్జి కోబ్రాలు ఎలా పడగ విప్పి ఆడుతున్నాయో చూడండి..
స్వప్రయోజనాల కోసం మనుషులు అడవులు నరికివేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా మరికొన్ని అడవులు తగలబడిపోతున్నాయి. దీంతో అడవుల్లో ఉండే జీవులు జనావాసాలవైపు...
స్వప్రయోజనాల కోసం మనుషులు అడవులు నరికివేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా మరికొన్ని అడవులు తగలబడిపోతున్నాయి. దీంతో అడవుల్లో ఉండే జీవులు జనావాసాలవైపు వస్తున్నాయి. అవి దారి తప్పి.. ఊర్ల వైపు వస్తే జనాలు రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పాము కనిపించింది అంటే దాని మరణం చూసే వరకు వదిలిపెట్టరు. పాము ప్రమాదకరమైనదే అవ్వొచ్చు. కానీ తన జోలికి రానంతవరకు ఎవరికీ అది హాని చెయ్యదు. పొరపాటున తొక్కితే, లేదా దాని హాని కలిగిస్తేనే ఏ సర్పమైనా కాటు వేస్తుంది. కాగా కోబ్రా పాములు సంబంధించిన చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో రోజూ వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే మీరు బుజ్జి, బుజ్జి కోబ్రా పిల్లల్ని ఎప్పుడైనా చూశారా. అలాంటి చాలా కోబ్రా పిల్లలు ఒకేచోట పడగవిప్పి ఆడటం మీరు ఎప్పుడైనా చూశారా. అలాంటి వీడియోను ఇప్పుడు మీకు చూపించ బోతున్నాం. ఇటీవల ఫారెస్ట్ సర్వీస్ వాలంటీర్ టీమ్ మిస్సైన కోబ్రా గుడ్లను సేకరించి.. వాటిని ప్రత్యేక పద్దతుల్లో జాగ్రత్తగా దాచి ఉంచారు. 50 రోజుల తర్వాత, కోబ్రా పిల్లలు గుడ్ల నుండి బయటపడ్డాయి. ఆ తర్వాత వాటిని అడవిలో వదిలేశారు. ఆ పాము పిల్లల వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 41 సెకన్ల వీడియోలో, అనేక చిన్న కోబ్రా పాములు బకెట్‌లో తిరుగుతుండటం, పడగవిప్పి ఆడుకోవడం చూడవచ్చు.
ముందుగా వీడియో వీక్షించండి
These cute cobras. Eggs were rescued by our volunteer & after 50 days they are out. Released in wild !! pic.twitter.com/Uuzx2rPQad
— Parveen Kaswan (@ParveenKaswan) August 24, 2021
సోషల్ మీడియాలో ఈ బుజ్జి కోబ్రా పిల్లల వీడియో తెగ వైరల్ అవుతుంది. ప్రజలు ఈ చిత్రాలను ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడమే కాదు.. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. పాము గుడ్లను రక్షించిన టీమ్‌కు చాలా మంది సోషల్ మీడియాలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Also Read: టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు టెన్షన్… సడెన్‌గా సీన్‌లోకి ఈడీ ఎంట్రీ.. మనీ లాండరింగ్, హవాల వ్యవహారాలు..?
పెద్ద కొడుకు అప్పు చేసి భార్యతో పారిపోయాడు.. అవమానం, బాధ తట్టుకోలేక మిగిలిన కుటుంబమంతా