Viral Video: లేటెస్ట్ టెక్నిక్.. ఆవులకి ఆ మ్యూజిక్ పెట్టాడు.. ఆదాయం పెంచుకున్నాడు..

Viral Video: టర్కీలో ఓ రైతు వింతగా ఆలోచించాడు. తన ఆవులకి వర్చువల్ రియాలిటీ గాగుల్స్ పెట్టాడు. దీంతో అవి వేసవి కాలంలో బహిరంగ మైదానంలో

Viral Video: లేటెస్ట్ టెక్నిక్.. ఆవులకి ఆ మ్యూజిక్ పెట్టాడు.. ఆదాయం పెంచుకున్నాడు..
Cows
Follow us
uppula Raju

|

Updated on: Jan 10, 2022 | 8:26 PM

Viral Video: టర్కీలో ఓ రైతు వింతగా ఆలోచించాడు. తన ఆవులకి వర్చువల్ రియాలిటీ గాగుల్స్ పెట్టాడు. దీంతో అవి వేసవి కాలంలో బహిరంగ మైదానంలో మేస్తున్నట్లుగా అనుభూతి చెందుతున్నాయి. ఈ పద్దతి ఆవులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీంతో ఆవులు సంతోషంగా ఎక్కువ పాలు ఇవ్వడం ప్రారంభించాయి. టర్కీలోని అక్సరయ్ నగరానికి చెందిన ఇజ్జత్ కోకాక్ పాల ఉత్పత్తిని పెంచడానికి ఈ ప్రయత్నం చేశాడు.

వేసవిలో ఆవులు బహిరంగంగా ఆకాశం కింద పొలాల్లో మేస్తున్నట్లుగా భావించేలా కళ్లకు వర్చువల్ రియాలిటీ (VR) గాగుల్స్ పెట్టాడు. దీంతో ఆవులు సూర్యుడి వెలుతురులో పచ్చటి పచ్చిక బయళ్లలో స్వేచ్చగా తిరుగుతున్నట్లు భావిస్తున్నాయి. పచ్చటి ప్రకృతి దృశ్యాలు, పక్షుల శబ్దాలు ఆవులను సంతోషపరుస్తున్నాయి. దీంతో అవి ఎక్కువ పాలు ఇస్తున్నాయి. వాటి పాల ఉత్పత్తి రోజుకు 22 లీటర్ల నుంచి 27 లీటర్లకు పెరిగాయి.

కోకాక్ ప్రకారం.. వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ మానవుల కోసం ఉపయోగిస్తారు. అయితే ఆవులు కూడా ఈ VR గ్లాసులను ధరించవచ్చు. పశువైద్యులు, కన్సల్టెంట్లు, డెవలపర్లు వాటిని ప్రత్యేకంగా రూపొందించారు. వీటిని ఆవు తలకు అనుగుణంగా మార్చడమే కాకుండా VR హెడ్‌సెట్ సాఫ్ట్‌వేర్‌లోని రంగుల పాలెట్‌ను కూడా మార్చారు. ఎందుకంటే ఆవులకు ఎరుపు, ఆకుపచ్చ రంగు కనిపించదు.

Viral Photos: ఒకప్పుడు భూమిపై భారీ జంతువులు నివసించేవి.. వాటిని చూస్తే జడుసుకుంటారు..

Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజు ఈ 5 పండ్లు తినాలి..! అవేంటంటే..?

Omicron: ఒమిక్రాన్‌తో పోరాడాలంటే ఇవి మీ డైట్‌లో ఉండాల్సిందే.. లేదంటే వైరస్‌ ముప్పు తప్పదు..?