- Telugu News Photo Gallery Viral photos Giant and extinct animals who lived on earth millions of years ago
Viral Photos: ఒకప్పుడు భూమిపై భారీ జంతువులు నివసించేవి.. వాటిని చూస్తే జడుసుకుంటారు..
Viral Photos: డైనోసర్ల గురించి మీరు వినే ఉంటారు. ఒకప్పుడు భూమిపై నివసించిన అతి పెద్ద జంతువులు ఇవే. కానీ అకస్మాత్తుగా అంతం అయ్యాయి.
Updated on: Jan 10, 2022 | 7:59 PM

డైనోసర్ల గురించి మీరు వినే ఉంటారు. ఒకప్పుడు భూమిపై నివసించిన అతి పెద్ద జంతువులు ఇవే. కానీ అకస్మాత్తుగా అంతం అయ్యాయి. కానీ ఇప్పటికీ డైనోసర్ల శిలాజాలు, గుడ్లు దొరకడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

డైనోసర్ల యుగంలో మొసళ్ళు కూడా భారీగా ఉండేవి. ఇవి నేటి కాలంలో ఉన్న మొసళ్ల కంటే చాలా పెద్దవి. బరువుగా ఉండేవి. డైనోసర్‌లను కూడా చంపి తినేంత ప్రమాదకరంగా ఉండేవి.

ఈ పెద్ద మొసళ్లు 30 అడుగుల పొడవు ఉండేవి. 3600 కిలోల కంటే ఎక్కువ బరువు ఉంటాయని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. వాటి కళ్లు బైనాక్యులర్‌లా పనిచేసేవి. రాత్రిపూట కూడా సులభంగా వేటాడేవి.

మిలియన్ల సంవత్సరాల క్రితం పారాసెరాథెరియం అనే పెద్ద ఖడ్గమృగం కూడా ఉండేది. వాటి ఎత్తు 26 నుంచి 40 అడుగుల వరకు ఉంటుంది. వాటి బరువు 15 నుంచి 20 టన్నుల వరకు ఉంటుంది. శాస్త్రవేత్తలకు ఈ జంతువు ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయింది.

మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ పెద్ద జంతువులు ఆసియా, పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో నివసించేవి. అయితే వాతావరణ మార్పు, తక్కువ సంతానోత్పత్తి కారణంగా భూమిపై నుంచి అంతరించిపోయాయి.



