AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వెంటాడి వేటాడింది.. ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు..

అడవిలో సింహం, పులి, చిరుత వేటాడితే.. గాలిలో బలమైన డేగా హంటింగ్ దారుణంగా ఉంటుంది. అది టార్గె చేసిందంటే ఇక అంతే.. అది దేనినైనా ఎగురేసుకుపోతుంది. ఎంత

Viral Video: వెంటాడి వేటాడింది.. ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు..
White Hawk Eagle Attack
Sanjay Kasula
|

Updated on: Jan 11, 2022 | 7:19 PM

Share

అడవిలో సింహం, పులి, చిరుత వేటాడితే.. గాలిలో బలమైన డేగా హంటింగ్ దారుణంగా ఉంటుంది. అది టార్గె చేసిందంటే ఇక అంతే.. అది దేనినైనా ఎగురేసుకుపోతుంది. ఎంత పెద్ద జంతువైన దాడి మాత్రం అదే స్థాయిలో ఉంటుంది. తన దాడి నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు. డేగ దాని కళ్ళు, గోళ్ల బలంతో మాత్రమే వేటాడుతుంది. దాని టార్గెట్ ఎక్కడ దాక్కున్న దాడి చేయకుండా మాత్రం వదిలిపెట్టదు. ఎక్కడికి పెరిగెత్తినా డేగ కన్నుల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. దాని చూపు పడిన తర్వాత దానిని ఎవరూ రక్షించలేరు. మీరు నమ్మకపోతే తాజాగా వీడియోలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు. ఈ వీడియో తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్  చేయబడింది.

ఈ వీడియోలో ఏం జరుగుతుంది? ఈ వీడియో పావురాల కాశ్మీర్ పేరుతో ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేయబడింది. అయితే ఈ వీడియోలోని దృశ్యాలు ఎక్కడ రికార్డ్ చేశారన్నది మాత్రం తెలియరాలేదు. ఒక తెల్లటి డేగ నేలపై నడుస్తున్న కుందేలును చూసి దానిని ఎలా తరుముతుందో చూడవచ్చు. డేగ నుంచి తప్పించుకునేందుకు  కుందేలు చుట్టూ పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత కూడా డేగ దాడి నుంచి తప్పించుకోలేక పోయింది. చివరికి డేగ వేటకు చిక్కింది.

ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు డేగ వేటాడే తీరును ప్రశంసిస్తుంటే.. మరింకొందరు యూజర్లు మాత్రం ఇది దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. వీడియోను ఇప్పటికే వేలాధి మంది చూసి లైక్ చేశారు. అంతే కాదు తెగ షేర్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Punjab Assembly Election 2022: వీటి చుట్టే తిరుగుతున్న పంజాబ్ ఎన్నికలు.. ఆశలన్నీ కింగ్ మేకర్‌పైనే..

Flamingos: ఫ్లెమింగోలు ఒంటికాలి జపం ఎందుకు చేస్తాయో తెలుసా.. దీని వెనుక ఓ సైన్స్..

Follow Us
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..