Chicken Fly: పక్షి ఎగురుతుంది.. అయితే రెక్కలు ఉన్న అన్ని పక్షులు ఎగరవు.. ఇందులో ఎగిరిపోయే పక్షులు పర్వతాలను కూడా దాటగలవు. ఒక చోటి నుంచి మరో చోటికి ఈజీగా ఎగురగలవు.. అంతేందుకు కొన్ని సమయాల్లో అయితే, కొన్ని పక్షులు రెక్కలు ఉన్నప్పటికీ ఎగరలేవు. వీటిలో కోళ్లు కూడా ఉన్నాయి. వాటికి రెక్కలు ఉన్నాయి. కానీ అవి తక్కువ ఎత్తులో తక్కువ సమయం వరకు ఎగురుతాయి. రెక్కలతో ఎక్కువసేపు ఎగరలేవు. అయితే ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మీరు కూడా ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండరు. ఈ వీడియో కోడిపిల్లకి సంబంధించినది. ఇది చాలా దూరం ప్రయాణించినట్లు కనిపిస్తుంది. కోడి ఇంత దూరం ప్రయాణించడం మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు.
ఒక కోడి పరిగెడుతూ కొంత దూరం పరుగెత్తడం.. ఆ తర్వాత అక్కడి నుంచి ఎగరడం ప్రారంభించడం వీడియోలో మీరు చూడవచ్చు. అప్పుడు అది తన రెక్కల సహాయంతో ఎగరడం ప్రారంభించింది. అలా ఎగురుతూ చాలా దూరం వెళుతుంది. అది ఎగరడం చూస్తుంటే అస్సలు కోడి అని అని అంటే మీరు నమ్మరు. చాలా దూరం ఎగిరే పక్షిలా రెక్కలు కట్టుకుంది. ఆమె ఎత్తుగా ఎగరలేకపోయినా.. ఆమె చాలా దూరం ప్రయాణించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఉంది. సాధారణంగా కోళ్లు కొన్ని మీటర్లు మాత్రమే ఎగరగలవు. అయితే ఇందులో కోడి చాలా మీటర్లు ఎగురుతుంది.
వీడియో చూడండి:
Never knew a chicken could fly that far.. pic.twitter.com/JU9IwfWxu6
— Buitengebieden (@buitengebieden_) January 29, 2022
ఈ షాకింగ్ వీడియో @buitengebieden_ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ అయ్యింది. ‘కోడి ఇంత దూరం ఎగురుతుందని ఎప్పుడూ తెలుసుకోలేదు’ అనే టైటిల్ జోడించారు. ఈ 52 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 2.5 లక్షలకు పైగా వీక్షించగా, 13 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు. అదే సమయంలో, చాలా మంది వీడియోను చూసి ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Kitchen Hacks: దానిమ్మ గింజలు తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా తీయొచ్చు..
PM Modi: ఎన్‌సీసీ ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రధాని మోడీ తలపాగ.. దీని ప్రత్యేకత ఎంటో తెలుసా..