Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips For Marriage : వివాహానికి అడ్డంకులు వస్తున్నాయా? అయితే, ఈ వాస్తు చిట్కాలను పాటించండి..!

Vastu Tips For Marriage : సాధారణంగానే పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయి ఇంట్లో ఉంటే ఇరుగుపొరుగు వారు..

Vastu Tips For Marriage : వివాహానికి అడ్డంకులు వస్తున్నాయా? అయితే, ఈ వాస్తు చిట్కాలను పాటించండి..!
Marriage(representative image)
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 30, 2022 | 4:44 PM

Vastu Tips For Marriage : సాధారణంగానే పెళ్లీడుకు వచ్చిన అమ్మాయి, అబ్బాయి ఇంట్లో ఉంటే ఇరుగుపొరుగు వారు, బంధువులు మొదటగా అడిగే ప్రశ్న.. మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు? మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు? అని. ఈ ప్రశ్న, సదరు యువతీ, యువకుడికే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. అయితే, కొందరికి వివాహం చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. పెళ్లిళ్లు కుదరవు. ఏవో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. అవి వారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తాయి. వయసు పెరిపోతుండటం, పెళ్లి ఇంకా అవకపోవడంతో మానసిక ఆందోళనలు రేకెత్తుతాయి. కొందరేమో.. సరైన భాగస్వామి దొరకని కారణంతో.. మరికొందరు పని దృష్టి పెట్టడం వల్ల పెళ్లి చేసుకోలేకపోతుంటారు. మీకు కూడా ఇలాంటి సమస్యల కారణంగా పెళ్లి జరుగకపోతున్నట్లయితే మరేం పర్వాలేదంటున్నారు జ్యోతిష్య పండితులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని వాస్తు చిట్కాలను పాటిస్తే వివాహం విషయంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి త్వరగా వివాహం జరుగుతుందట. మరి ఆ వాస్తు టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మంచం ఏ దిశలో పడుకోవాలంటే.. పెళ్లికాని స్త్రీ ఇంటి వాయువ్య దిశలో నిద్రపోవాలి. ఇంటి నైరుతి మూలలో అస్సలు నిద్రించకూడదు. ఇలా చేయడం ద్వారా పెళ్లి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా, అవివాహితుడైన యువకుడు ఈశాన్య దిశలో పడుకోవాలి. ఆగ్నేయ దిశలో పడుకోకూడదు.

బెడ్‌షీట్ రంగు.. పింక్, పసుపు, లేత ఊదా, తెలుపు వంటి లేత రంగు బెడ్ షీట్ మీద నిద్రించడం మంచిది. ఇది గదిలో సానుకూల శక్తిని పెంచుతుంది. వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తికి సానుకూల శక్తిని ఇస్తుంది.

అచ్చుపోసిన ఇనుము.. పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి మంచం కింద ఎలాంటి ఇనుప వస్తువును పెట్టుకుని పడుకోకూడదు. పెళ్లి కాని వారు తమ గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. తద్వారా గదిలో సానుకూల శక్తి వస్తుంది.

భారీ వస్తువులు.. ఇంటి మధ్యలో బరువైన వస్తువులు లేదా మెట్లను ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే ఇది వివాహ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం.. బరువైన వస్తువులు ఇంట్లో ఉండటం.. వివాహం విషయంలో శ్రేయస్కరం కాదు.

గోడ రంగు.. ఇల్లు మొత్తం లేత రంగుల గోడలు ఉండాలి. గోడ కోసం పాస్టెల్ రంగులను ఎంచుకోవడం మంచిది. గోడలపై ముదురు రంగులను ఉపయోగించవద్దు.

దుస్తుల రంగు .. వాస్తు శాస్త్రం ప్రకారం.. అవివాహిత స్త్రీ పురుషులు నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి. ఈ రంగు అశుభంగా పేర్కొంటారు. ఈ రంగు నిరాశకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రంగు.. వివాహానికి అడ్డంకులుగా ఉన్న శని, రాహువు, కేతువులను సూచిస్తుంది. వీలైతే.. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ బట్టలు ధరించాలి.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రజల సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.)

Also read:

Bhama Kalapam: భామా కలాపం ట్రైలర్ లాంచ్ రేపే.. హాజరుకానున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ..

Govt Policy: పిల్లల్ని కనండి.. బహుమతులు, రాయితీలు పొందండి.. ఆఫర్లు మామూలుగా లేవండోయ్..!

Dinesh Karthik: జట్టులోకి తిరిగి వస్తా.. టీ20లో ఆడే సత్తా ఇంకా ఉంది..