Kitchen Hacks: దానిమ్మ గింజలు తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా తీయొచ్చు..

జీర్ణ వ్యవస్థ మెరుగు పరుచుకోవడానికి, క్యాన్సర్ నుండి కాపాడుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి, గుండె జబ్బులు దరి చేరకుండా ఉండడానికి, డయాబెటిస్ ని నయం చేయడానికి దానిమ్మ పండు సహాయ పడుతుంది.

Kitchen Hacks: దానిమ్మ గింజలు తీసేందుకు ఇబ్బందులు పడుతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా తీయొచ్చు..
How To Remove Pomegranate Seeds
Follow us

|

Updated on: Jan 30, 2022 | 2:44 PM

How To Remove Pomegranate Seeds: జీర్ణ వ్యవస్థ మెరుగు పరుచుకోవడానికి, క్యాన్సర్ నుండి కాపాడుకోవడానికి, బరువు తగ్గించుకోవడానికి, గుండె జబ్బులు(Heart Attack) దరి చేరకుండా ఉండడానికి, డయాబెటిస్(Diabetes) ని నయం చేయడానికి దానిమ్మ పండు(Pomegranate) సహాయ పడుతుంది. దానిమ్మ పండులో ఫైబర్ శాతం చాలా ఉంటుంది. కాబట్టి సమయం లేనప్పుడు మాత్రమే దానిమ్మ జ్యూస్ ను తీసుకోండి ఎందుకంటే గింజలను తిన్నప్పుడు మాత్రమే మీ శరీరానికి ఫైబర్ ఎక్కువగా అందుతుంది. అయితే ప్రతి పండును కట్ చేసుకొని తినడానికి ఒక విధానం ఉంటుంది. దానిమ్మ పండుకు కూడా అలానే ఒక విధానం ఉంది. చాలా మంది దానిమ్మ పండును సగానికి కోసి సరైన విధంగా గింజలను తీసుకోలేక పోతారు. అలా చేయడం వల్ల చాలా పండు వేస్ట్ అవుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా.. పండును వేస్ట్ చేయకుండా గింజలును తినడానికి ఒక విధానం ఉంది.

దానిమ్మ గింజలు తియ్యగా, కొంచెం వగరుగా ఎంతో రుచిగా జ్యూసీగా ఉంటాయి. ఈ గింజలను మామూలుగా తినొచ్చు లేదా సలాడ్స్ లో, డిప్స్ లో లేదా రైతాలో కలుపుకోవచ్చు. అయితే మీరు తప్పకుండా దానిమ్మ గింజలను ఎలా తీయాలో నేర్చుకోవాలి. ఇది ఎంతో అవసరం. మీరు సరైన పద్ధతిలో దానిమ్మ పండును కట్ చేస్తున్నారా..? ముందుగా చూసుకోండి. ఎలా కట్ చేయాలి..? అందులో నుంచి గింజలను ఎలా తీసుకోవాలో తెలసుకుందాం..

ఈ మధ్య సోషల్ మీడియాలో దానిమ్మ గింజలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా హల్చల్ అవుతున్నాయి. అయితే ఆ వీడియోలను చూసి సోషల్ మీడియా యూజర్లు ఇటువంటి కొత్త విధానాలు మాకు తెలీదు అని కామెంట్ చేస్తున్నారు, మరి కొందరైతే అటువంటి విధానాలు కొన్ని దానిమ్మ పండ్లకు మాత్రమే వర్తిస్తాయి అని, ఎందుకంటే వాటిలో తక్కువ నీటి శాతం ఉంటుందని అంటున్నారు. ఎక్కువగా జ్యూసీగా ఉన్న దానిమ్మ పండ్లను ఇలా చేస్తే వృధా జరుగుతుంది అని భావిస్తున్నారు.

అయితే.. సోషల్ మీడియాలో ఎక్కువగా చూపిస్తున్న వీడియో దేనికి సంబంధించింది అంటే దానిమ్మ పండు అడుగు భాగం లో స్క్వేర్ ఆకారంలో కట్ చేసి, ఆ తర్వాత స్క్వేర్ ఆకారం నుండి లోపల ఉండే తెల్లని పొరను ఆధారంగా తీసుకుని భాగాలుగా విభజిస్తారు. ఇలా చేయడం వల్ల దానిమ్మ గింజలు సులువుగా వస్తున్నాయి. అయితే ఈ పద్ధతి అన్ని దానిమ్మ పండ్లకు వర్తించవు. అయితే, బాగా పెద్ద దానిమ్మ పళ్ళు అయితే గింజలు బాగా వచ్చే అవకాశాలు ఉంటుంది.

చిన్న సైజులో ఉండేటు వంటి దానిమ్మ పండును కట్ చేయడం ఎలా..?

చిన్న సైజు దానిమ్మ పండు ని కట్ చేయడానికి ముందుగా దానిని రెండు భాగాలుగా కట్ చేయాలి. అలా చేసి దానిమ్మ పండు పై భాగాన్ని కొంచెం బరువుగా ఉండే ఎటువంటి వస్తువుతో అయినా పై భాగంను కొట్టి లేదా చేతితో టాప్ చేయాలి. ఇలా చేస్తే దానిమ్మ గింజలు సులువుగా వస్తాయి. ముందుగా దానిమ్మ పండును కట్ చేయడానికి స్టెమ్(తొడిమే) భాగాన్ని గుర్తించాలి. స్టెమ్ భాగంలో చాలా పల్చగా దానిమ్మ పండును కట్ చేయాలి.

లోపల ఉండే తెల్లని పొర బట్టి దానిమ్మ పండును నాలుగు లేదా ఐదు భాగాలుగా విభజించాల్సి ఉంటుంది. ఆ తెల్లని పొర ఆధారంగా కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకొని కత్తితో కోయండి. ఇలా ఒక భాగాన్ని విభజించిన తర్వాత అదే విధంగా మిగిలిన భాగాలను కట్ చేయండి. ఇప్పుడు చేతితో మీరు కట్ చేసిన భాగాలను బయటకు తీయండి. మధ్య భాగంలో ఉండే పెద్ద భాగం ను బయటకు తీయండి.

ఇప్పుడు చేతిలోకి దానిమ్మ పండును తీసుకొని చేతితో దానిమ్మ గింజలు బయటకు తీసేయండి. ఇలా చేస్తున్నప్పుడు ఆ తెల్లని పొర గింజలులో కలిసిపోకుండా ఉండటానికి మంచి నీళ్ల సహాయాన్ని ఉపయోగించండి. ఈ పద్ధతి కష్టంగా అనిపిస్తే విభజించిన తర్వాత దానిమ్మ పండును చెక్క స్పూను సహాయంతో తొక్క భాగం పై కొట్టండి. ఇలా చేయడం వల్ల గింజలు కిందపడిపోతాయి.

మిగిలిన గింజలు తీయడానికి చేతి సహాయాన్ని కూడా ఉపయోగించవచ్చు. మంచి నీరు సాయంతో తెల్లని పొరను తీసేసిన ఇంకా మిగిలిపోతే గింజలలో మంచి నీళ్లు పోసి స్ట్రైన్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ఇతర పదార్థాలు లేకుండా రుచికరమైన దానిమ్మ గింజలను మీరు తినవచ్చు.

ఈ పద్ధతి నచ్చిందా…? అయితే తప్పకుండా ఈ ప్రక్రియను పాటించండి దానిమ్మ గింజలను తినండి. ఇలా చేస్తే సమయం కూడా ఆదా అవుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇలా చేస్తే దానిమ్మలోని గింజలు ఈజీగా వస్తాయి..

ఇవి కూడా చదవండి: Andhra pradesh: ఆ బాలికకు ఉచిత వైద్యం అందించండి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు..

Karimnagar Accident: కరీంనగర్‌లో కారు బీభత్సం.. గుడిసెలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి