Viral Video: పాపం.. నీటి కోసం వచ్చి బురదలో కూరుకుపోయిన ఆడ ఏనుగులు.. రెండు రోజులుగా అక్కడే..
రెండు ఏనుగులు నీటి కోసం వెతుక్కుంటూ వచ్చి నీటి గుంత దగ్గర బురదలో కూరుకుపోయాయి. రెస్క్యూ టీం వాటిని గుర్తించే వరకు రెండు రోజుల పాటు అవి అక్కడ చిక్కుకున్నాయి.
Viral Video: రెండు రోజుల పాటు బురదలో కూరుకుపోయిన రెండు ఆడ ఏనుగులను రక్షించే హృదయాన్ని కదిలించే వీడియో వైరల్ అవుతోంది. రెండు ఏనుగులు నీటి కోసం వెతుక్కుంటూ వచ్చి నీటి గుంత దగ్గర బురదలో కూరుకుపోయాయి. రెస్క్యూ టీం వాటిని గుర్తించే వరకు రెండు రోజుల పాటు అవి అక్కడ చిక్కుకున్నాయి. షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ మొత్తం రెస్క్యూ ప్రక్రియను చూపుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు ఇలాంటి క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ రెండు ఆడ ఏనుగులకు దాహమే వాటికి మరణ ఉచ్చుగా మారింది.. కరువు సమయంలో ఇది సర్వసాధారణమైన పరిస్థితి..నీటి కోసం ఏనుగులు అడవిలో అన్వేషిస్తూ.. పలు సందర్బాల్లో ఏనుగులు ఎండిపోతున్న ఆనకట్టలలోకి ప్రవేశించి బురదలో కూరుకుపోతాయి. మెత్తటి మట్టితో నిండిన గుంతలు, బురదతో కప్పబడిన లోతైన ప్రదేశాల్లో ఏనుగులు పడిపోతుంటాయి. అవి తమను తాము రక్షించుకోలేవు..ఇది నిజంగానే ఏనుగులకు ప్రాణాంతక పరిస్థితి అవుతుంది. అయితే, ఈ ఘటన కెన్యాలో చోటు చేసుకున్నట్టుగా తెలిసింది.
ఇక్కడ కూడా బురద గుంటలో పడిపోయిన ఈ ఏనుగులను కనుగొనబడటానికి రెండు రోజుల సమయం పట్టింది. కానీ, ఎట్టకేలకు రెస్క్యూటీం కృషితో ఆ రెండు ఏనుగులు సురక్షితంగా రక్షించబడ్డాయి. KWS మరియు వైల్డ్‌లైఫ్ వర్క్స్‌తో సంయుక్త ఆపరేషన్ ద్వారా రెండు ఆడ ఏనుగులను రక్షించగలిగామని అధికారులు చెప్పారు.
View this post on Instagram
బురదలో కూరుకుపోయిన ఏనుగును రక్షించిన వారి ప్రయత్నాలను, కష్టాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, మీరు చేస్తున్న పనికి నేను చాలా కృతజ్ఞుడను. మీరు భూమిపై దేవదూతలు అంటూ కామెంట్ చేశారు. మరొకరు ఇలా వ్యాఖ్యానించారు, మీరు చేస్తున్న ప్రయత్నానికి నా కళ్ళలో కన్నీళ్లు వస్తున్నాయంటూ కామెంట్ చేశారు.ఇలా నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి