Government Hospital: సర్కార్‌ ఆస్పత్రిలో రోగుల దుస్థితి.. నేలపైనే చిన్నారికి రక్తం ఎక్కించిన వైద్యులు..

ఆసుపత్రిలో బెడ్ ఖాళీగా లేకపోవడంతో నేలపై కూర్చుబెట్టిన సిబ్బంది సంతోషికి రక్తం  ఎక్కించారు. బ్లాడ్ బ్యాగ్‌ని తల్లికి అందించారు. స్థానికులు కొందరు ఇదంతా ఫోటోలు, వీడియోలు తీసి..

Government Hospital: సర్కార్‌ ఆస్పత్రిలో రోగుల దుస్థితి.. నేలపైనే చిన్నారికి రక్తం ఎక్కించిన వైద్యులు..
Health System
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 15, 2022 | 10:38 AM

Government Hospital: ఆసుప‌త్రిలో జ‌రిగే కొన్ని సంఘ‌ట‌నలు చాలా హృద‌య‌విదార‌కంగా ఉంటాయి. తాజాగా ఓ బాలికకు నేలపై కూర్చోబెట్టి రక్తం ఎక్కిస్తున్న దృశ్యం బ‌య‌ట‌కు రాగా, దీనిని చూసి అంద‌రు చ‌లించిపోతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలోని మైహర్ సివిల్ హాస్పిటల్‌లో ఈషాకింగ్‌ సీన్‌ కనిపించింది. ఈ చిత్రం మొత్తం ఆరోగ్య వ్యవస్థపైనే అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.. ఆ చిత్రంలో ఓ చిన్నారి చేతికి రక్తం ఎక్కిస్తున్నారు. చిన్నారి తల్లి ఆ బ్లడ్‌ ప్యాకెట్‌ని పైకి ఎత్తి పట్టుకొని ఉంది. ఈ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన ప్రతిఒక్కరూ చలించిపోయి కామెంట్స్‌ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బాధితురాలి పేరు సంతోషి కేవత్, 15 ఏళ్ల సంతోషికి హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని చెబుతున్నారు. దీంతో ఆమెకు రక్తం ఎక్కించారు. అయితే ఆసుపత్రిలో బెడ్ ఖాళీగా లేకపోవడంతో నేలపై కూర్చుబెట్టిన సిబ్బంది సంతోషికి రక్తం  ఎక్కించారు. బ్లాడ్ బ్యాగ్‌ని తల్లికి అందించారు. స్థానికులు కొందరు ఇదంతా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో అది కాస్త వైరల్‌గా మారింది.. సత్నా జిల్లాలోని సివిల్ హాస్పిటల్ మైహర్ లో ఇలాంటి దృశ్యం ఎదురవటంతో… కలెక్టర్ అనురాగ్ వర్మ ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. CMHO డా. విచారణ తర్వాత మైహార్ హాస్పిటల్ ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్ నిగమ్‌కి ఒక ఇంక్రిమెంట్, స్టాఫ్ నర్సు అంజు సింగ్‌కి రెండు ఇంక్రిమెంట్లు తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.

ఇటీవలి కాలంలో, మధ్యప్రదేశ్‌లో ఆరోగ్య వ్యవస్థపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, భింద్ నుండి ఒక ఫోటో వెలుగులోకి వచ్చింది. అందులో ఒక వ్యక్తి అంబులెన్స్ దొరకని కారణంగా హ్యాండ్‌కార్ట్‌పై అనారోగ్యంతో ఉన్న తండ్రితో ఆసుపత్రికి చేరుకున్నాడు. వృద్ధులను ఆస్పత్రికి తరలించేందుకు బంధువులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసినా అంబులెన్స్ రాలేదు. దాంతో వృద్ధుడి కొడుకు హరి సింగ్ ఒక తోపుడు బండిని తీసుకొని, దానిపై తన తండ్రిని పడుకోబెట్టి బండిని 5 కిలోమీటర్లు తోసుకుని ఆసుపత్రికి చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు