AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాపం పసివాడు.. తల్లి మేకప్‌ తీస్తుంటే చూడలేక తల్లడిల్లిపోయాడు.. వద్దు మమ్మీ.. వద్దంటూ..

అది చూసిన పిల్లవాడు..వద్దు మమ్మీ..వద్దు వద్దు అంటూ..కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అలా చెయ్యొద్దు అమ్మ అంటూ..తల్లి రెండు చేతులను పట్టుకుని ఆపుతున్నాడు. అయినప్పటికీ

Viral Video: పాపం పసివాడు.. తల్లి మేకప్‌ తీస్తుంటే చూడలేక తల్లడిల్లిపోయాడు.. వద్దు మమ్మీ.. వద్దంటూ..
Little Boy Cries
Jyothi Gadda
|

Updated on: Sep 15, 2022 | 9:40 AM

Share

Viral Video: గ్లామర్‌ మేకప్‌తో కూడిన ఫేక్ ఐ లాషెస్ అనేది ఇటీవలి మేకప్ ట్రెండ్.. ఇది చూసిన చాలా మంది వ్యక్తులు నిజమని భావిస్తారు. మేకప్ మాయాజాలం అర్థం చేసుకోలేక జనాలు అయోమయంలో పడుతుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఇందులో తన తల్లి తన కనురెప్పల ద్వారా తనను తాను గాయపరుచుకుంటుందని భావించిన ఒక చిన్న పిల్లవాడు వద్దు మమ్మీ అంటూ బోరున ఏడ్చేస్తున్నాడు.. హృదయాన్ని కదిలించే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ వీడియోను వీడియో కంటెంట్ సృష్టికర్త నేహా నితిన్ నాగ్‌పాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 2.6 మిలియన్లకు పైగా వీక్షణలతో రీల్ వైరల్ అయింది. మీ బిడ్డ అక్కడ ఏ మాత్రం బాధ, నొప్పి లేని విషయం మీద బాధను అనుభవిస్తున్నాడు. దీనినే స్వచ్ఛమైన ప్రేమ అంటారు. నా బేబీ @divitnagpal కూడా అలాగే భావించాడు…నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు… బెస్ట్ ఫీలింగ్ అనే క్యాప్షన్‌తో వీడియోని అప్‌లోడ్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

వైరల్‌ క్లిప్‌లో నేహా ఒక ఈవెంట్ నుండి ఇంటికి వచ్చి తన మేకప్ తీసేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె తన నకిలీ కనురెప్పలను బయటకు తీయడం ప్రారంభించినప్పుడు.. ఆమె కొడుకు తన తల్లి తన నిజమైన వెంట్రుకలను పీకేసుకుంటుందని భావిస్తాడు..ఆమె కనురెప్పలను లాగేస్తుండటం స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసిన పిల్లవాడు..వద్దు మమ్మీ..వద్దు వద్దు అంటూ..కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. అలా చెయ్యొద్దు అమ్మ అంటూ..తల్లి రెండు చేతులను పట్టుకుని ఆపుతున్నాడు. అయినప్పటికీ అతని తల్లి పెట్టుకున్న నకిలీ ఐ లాషెస్‌ని తొలగించింది. తనకు ఏదో అవుతుందని భావించిన కొడుకు ఆమె కోసం ఏడవటం చూసి ఆ తల్లి పిల్లవాడిని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంటుంది.

కొడుకు తనను ఎంతగానో ప్రేమిస్తున్నందుకు వాడికి ముద్దులు పెడుతోంది. ఇది ఇంటర్నెట్‌లో మధురమైన ఇన్సిడెంట్‌గా వైరల్‌ అవుతోంది. నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఆ అబ్బాయి తన తల్లిని ఎంతగానో ప్రేమిస్తున్నాడని, ఆమె బాధను చూడలేకపోయాడంటూ నెటిజన్లు వీడియోను ఎంతగానో లైక్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఒక్కడ క్లిక్ చేయండి