Alarm Bed: స్కూలుకి టైం అవుతున్నా పిల్లలు నిద్ర లేవడంలేదా.. అయితే ఇది మీ కోసమే..(వీడియో)
మనుషులకున్న జాఢ్యాలలో బద్ధకం కూడా ఒకటి. ఉద్యోగస్తులైతే ఉదయాన్నే లేచేందుకు బద్ధకిస్తారు. ఇది ఆరోజు పనులన్నింటిపై ప్రభావం చూపుతుంది. ఇక విద్యార్థులు..
మనుషులకున్న జాఢ్యాలలో బద్ధకం కూడా ఒకటి. ఉద్యోగస్తులైతే ఉదయాన్నే లేచేందుకు బద్ధకిస్తారు. ఇది ఆరోజు పనులన్నింటిపై ప్రభావం చూపుతుంది. ఇక విద్యార్థులు, యువకులైతే ఉదయాన్నే లేవాలన్నా, చదవాలన్నా చాలా బద్దకిస్తారు. అన్ని పనులు వాయిదా వేస్తూ తీరిగ్గా పరీక్షలు దగ్గర వచ్చేసరికి తెగ కంగారు పడిపోతుంటారు. అలాంటి వారికోసమే ఈ న్యూస్. సోషల్ మీడియాలో అలారం బెడ్ కు సంబంధించిన ఓ వీడియో ఒకటి తెగ వైరలవుతోంది. ఉదయాన్నే లేచేందుకు బద్ధకించే వారికి.. ఈ బెడ్ సరిగ్గా సరిపోతుంది. మనలోని నిద్రమత్తును వదిలించేవరకు మనల్ని కుదుపులకు గురిచేసే ఈ బెడ్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఉదయం అవుతున్నా ఒక బాలుడు నిద్ర లేవకుండా బెడ్‌పైనే పడుకుని ఉన్నాడు. అయితే అతడిని నిద్రలేపేందుకు తల్లిదండ్రులు ఒక చక్కని ఐడియా వేశారు. పిల్లాడికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏకంగా అలారం బెడ్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఫిక్స్ చేసిన సమయం రాగానే ఒక్కసారిగా బెడ్ కుదుపులకు గురయింది. బాలుడిని పైకి కిందకు ఎత్తి పడేసింది. దెబ్బకు ఆ బాలుడు ఉలిక్కిపడి లేచాడు. మళ్లీ పడుకోవాలని ట్రై చేసినా సాధ్యం కాలేదు. చివరకు చేసేదిలేక బెడ్ కిందకు దిగి అలారం ఆపేసాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ఇది బద్ధకస్తులకు బ్రహ్మాండమైన బెడ్, సూపర్ బెడ్’ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తుంటే.. ‘అర్జెంట్‌గా ఈ బెడ్ కావాలి. ఎక్కడ దొరుకుతుంది’ అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..