ప్రకృతి గీసిన చిత్తరువు.. సునామీ అనుకుంటే పొరబడినట్లే
ప్రకృతిని మించిన గొప్ప ఆర్టిస్ట్ భూమిపై లేడు. అంతేకాదు ప్రకృతి ఎంతటి అందమైనదో.. అంతే ప్రమాదకారి కూడా. మర్చిపోని అనుభవాన్ని, అనుభూతిని ఇచ్చే ప్రకృతి.. అంతే మొత్తంలో ప్రమాదం కలిగించి నాశనం చేసేస్తుంది.
ప్రకృతిని మించిన గొప్ప ఆర్టిస్ట్ భూమిపై లేడు. అంతేకాదు ప్రకృతి ఎంతటి అందమైనదో.. అంతే ప్రమాదకారి కూడా. మర్చిపోని అనుభవాన్ని, అనుభూతిని ఇచ్చే ప్రకృతి.. అంతే మొత్తంలో ప్రమాదం కలిగించి నాశనం చేసేస్తుంది. సునామీలు , వరదలు, తుఫానులు వంటివి చాలా భయంకరమైనవే కాకుండా ప్రమాదకరమైనవి కూడా. ఇవి ప్రతిదీ నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటాయి. ఇలాంటి ప్రకృతి ప్రమాదాలతో పాటు అందమైన ప్రకృతి చిత్రాలు సోషల్ మీడియాలో కోకొల్లలు. వీటని చూసిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోయారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ప్రాంతంలో కొన్ని ఇళ్లు ఉన్నాయి. వాటి ముందు విశాలమైన రోడ్డు కూడా ఉంది. అయితే ఆ ఇళ్ల వెనకాల చూస్తూ భయంకరమైన సునామీ వచ్చినట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి అది సునామీ కాదు మేఘం. అచ్చం సునామీని తలపిస్తున్న ఈ దృశ్యం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘నేను ఇంతకు ముందు ఇలాంటి మేఘాలను ఎప్పుడూ చూడలేదు’ అనే క్యాప్షన్ తో షేర్ యూజర్ షేర్ చేశారు. ఈ వీడియో లక్షలమంది వీక్షించగా వేలల్లో లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్వీన్ ఎలిజబెత్ మరణ సమయంలో ఆకాశంలో అద్భుతం !! ప్రకృతి ఘన నివాళి అర్పించిందంటున్న నెటిజన్లు
ప్రపంచంలోనే అత్యంత వింత జీవి.. దీని స్పెషాలిటీ తెలిస్తే షాకే
ఫుల్లుగా మద్యం తాగి బడికొచ్చిన లేడీ టీచర్ !! కట్ చేస్తే ??
Queen Elizabeth-II: ఎలిజబెత్-2 కు పెళ్లికి నిజాం నవాబు ఇచ్చిన గిఫ్ట్ ఇదే..
బెలూన్‌తో పాటు ఎగిరిన రైతు !! గాల్లోనే రెండు రోజులు.. చివరికి ??