Krishnam Raju: ప్రభాస్ పాటకు కృష్ణంరాజు చివరి డ్యాన్స్.. ఎమోషనల్ అవుతున్న అభిమానులు..
ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కృష్ణం రాజు కలిసున్న మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే డార్లింగ్ పాటకు కృష్ణంరాజు ఎంతో ఎనర్టిటిక్గా డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
టాలీవుడ్ సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) మృతితో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. అనారోగ్య సమస్యలతో కొద్దిరోజులుగా గచ్చిబౌలీలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం సాయంత్రం మొయినాబాద్‌లోని కనకమామిడి ఫామ్ హౌస్‌లో జరిగాయి. తమ అభిమాన హీరోను చివరి చూపు చూసేందుకు భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. మరోవైపు రెబల్ స్టార్ మరణాన్ని సినీ ప్రముఖులు.. అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించిన కృష్ణంరాజుకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కృష్ణం రాజు కలిసున్న మధురమైన జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే డార్లింగ్ పాటకు కృష్ణంరాజు ఎంతో ఎనర్టిటిక్గా డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ప్రభాస్ నటించిన మిర్చి సినిమా ఆడియో ఫంక్షన్లో స్టేజ్ పై డ్యాన్స్ చేశారు కృష్ణంరాజు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఆయనతో యాహు యాహు పాటకు స్టెప్పులేయించారు. అందులో రెబల్ స్టార్ ఎంతో ఉత్సాహంగా చిందులేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కృష్ణంరాజు చివరి డ్యాన్స్ వీడియో అంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఇక కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ సినిమాలకు బ్రేక్ పడింది. డార్లింగ్ చేతిలో ఇప్పుడు అన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలున్నాయి. సలార్, ప్రాజెక్ కె చిత్రాల షూటింగ్స్ కు బ్రేక్ పడింది.
కృష్ణంరాజు డ్యాన్స్ వీడియో..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.