AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: రేవంత్ దెబ్బకు గీతూ షాక్.. అలా రివేంజ్ తీర్చుకున్న సింగర్.. ఫైమా ఏడుపు..

ఇక ఇంటి సభ్యులు అంతా ఏకమై గీతూను ఓడించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆమె బొమ్మను ఏలాగైనా కాజేయాలని విశ్వప్రయత్నాలు చేసారు. కానీ గీతూ మాత్రం

Bigg Boss 6 Telugu: రేవంత్ దెబ్బకు గీతూ షాక్.. అలా రివేంజ్ తీర్చుకున్న సింగర్.. ఫైమా ఏడుపు..
Bigg Boss
Rajitha Chanti
|

Updated on: Sep 15, 2022 | 8:00 AM

Share

బిగ్ బాస్ సీజన్ 6లో (Bigg Boss  6) కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇంట్లోని సభ్యులకు సిసింద్రీ టాస్క్ అంటూ బొమ్మలను ఇచ్చి వాటి అలన పాలన చూడాలని చెప్పారు. అలాగే తమ బొమ్మలను కాపాడుకునే బాధ్యత కూడా వాళ్లదే అని తెల్చీ చెప్పాడు. ఎవరి బొమ్మ అయితే లాస్ట్ అండ్ పౌండ్ ఏరియాలోకి వస్తే.. వారు టాస్క్ లో ఓడిపోయి గేమ్ నుంచి తప్పుకుంటారు. అయితే ఈ టాస్కులో గీతూ ఇంటి సభ్యులకు చుక్కలు చూపించింది. తన ఆటతీరుతో అందరిని ముప్పు తిప్పలు పెట్టింది. రేవంత్, శ్రీసత్య, అభినయ బొమ్మలను లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో వేయడంతో వారు ఆట నుంచి తప్పుకున్నారు. అలాగే శ్రీహాన్ బొమ్మను సైతం గీతూ దొంగిలించగా.. అర్జున్ కళ్యాణ్ బొమ్మను శ్రీహాన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏరియాలో వేశాడు. ఇక ఇంటి సభ్యులు అంతా ఏకమై గీతూను ఓడించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఆమె బొమ్మను ఏలాగైనా కాజేయాలని విశ్వప్రయత్నాలు చేసారు. కానీ గీతూ మాత్రం తెలివిగా ఆమె బొమ్మను స్టోర్ రూంలో దాచిపెట్టింది. కానీ ఆమె బొమ్మను చివరకు రేవంత్ కనిపెట్టేశాడు.

గీతూ బొమ్మను దొంగిలించి లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో పడేయడంతో ఆమె ఆట నుంచి తప్పుకుంది. దీంతో తన దగ్గరున్న బాలాదిత్య బొమ్మను తనదని బుకాయించే ప్రయత్నం చేసింది గీతూ. కానీ ఇంటి సభ్యులు బాలాదిత్య బొమ్మ అని తేల్చీ చెప్పేశారు. ఇక సింగర్ రేవంత్ ఇచ్చిన దెబ్బకు గీతూ పెద్ద షాక్ తగిలింది. ఇక ఆ తర్వాత టాస్కులో భాగంగా ఫైమా.. ఆరోహి.. కీర్తి.. ఇనయ.. అర్జున్ కళ్యాణ్ పోటి పడగా.. ముందుగా అర్జున్ ఓడిపోయాడు. ఆ తర్వాత ఫైమా కూడా ఓడిపోయింది. వాళ్లకు ఇచ్చిన షీల్డులతోనే తోసేయాల్సి ఉంటుందని చెప్పగా.. ఫైమా తన చేతులను ఉపయోగించింది. దీంతో సంచాలక్ గా ఉన్న రేవంత్ ఆమె ఓడిపోయిందని తెల్చేశాడు. ఇక అదే సమయంలో ఫైమా బొమ్మను అభినయ శ్రీ లాస్ట్ అండ్ ఫౌండ్ ఏరియాలో వేయడంతో ఆమె ఆట నుంచి తప్పుకుంది. దీంతో ఫైమా కన్నీళ్లు పెట్టికుంది. రేవంత్ తనను కావాలనే బయటకు పంపారని.. మళ్లీ తనకు ఆట ఆడేందుకు ఛాన్స్ ఇవ్వకుండా బొమ్మను పారేశారంటూ కీర్తితో చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యింది. ఇక మొత్తానికి ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం రాజ్, సూర్య, చంటి, ఇనయ నిలిచారు.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు