Viral Video: ‘ట్రూ లవ్ నెవర్ ఎండ్స్’.. మనసులను తాకుతున్న వృద్ధ దంపతుల బాండింగ్

సామాజిక మాధ్యమాల్లో నిత్యం ట్రెండింగ్ వీడియోలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని మాత్రం మనల్ని బాగా టచ్ చేస్తాయి. తాజాగా అలాంటి వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం.

Viral Video: 'ట్రూ లవ్ నెవర్ ఎండ్స్'.. మనసులను తాకుతున్న వృద్ధ దంపతుల బాండింగ్
Old Couple Bonding
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 27, 2021 | 11:04 AM

సోషల్ మీడియాలో డైలీ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో మనల్ని కొన్ని నవ్విస్తే.. మరికొన్ని షాక్‌కు గురిచేస్తాయి. ఇంకొన్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. మనసులను తాకే వీడియోలు కూడా చాలా సర్కులేట్ అవుతుంటాయి. తాజాగా అటువంటి వీడియోనే మీ ముందుకు తీసుకొచ్చాం. సుమారు 80 సంవత్సరాలు పైబడిన ఓ వృద్ధ జంట లోకల్ ట్రైన్‌లో కూర్చుని ఉండటం మీరు చూడవచ్చు. ఆ  సమయంలో, వృద్ధ మహిళ తన భర్తతో మాట్లాడే తీరు అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.  ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియో నిడివి కొద్ది సెకన్లు మాత్రమే ఉంది. కానీ వృద్ధ జంట మాట్లాడుకోవడం చూస్తే మీ ముఖంలో తెలియకుండానే ఓ పాజిటిల్ స్మైల్ వస్తుంది.  వీడియో చూసిన తర్వాత మీరు కూడా నిజమైన ప్రేమ ఎప్పటికీ అంతం కాదని చెబుతారు.

ముందుగా సదరు వీడియోని వీక్షించండి

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

వైరల్ అయిన వీడియో క్లిప్‌లో, వృద్ధ దంపతులు రైలులో ప్రయాణించడం మీరు చూడవచ్చు. ఈ సమయంలో వృద్ధురాలు నవ్వుతూ, తన భర్తతో నాన్‌-‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఉంది. ఆ మహిళ చాలా సంతోషంగా తన భర్తకు ఏదో చెబుతోంది. భర్త కూడా భార్య మాటలను వింటూ చిరునవ్వుతో  ఆమెను చూస్తూనే ఉన్నాడు. వారిద్దరి బాండింగ్ చూసేందుకు చూడముచ్చటగా ఉంది. మనసులకు కూడా హాయి కలిగిస్తుంది.  వృద్ధ దంపతుల మధ్య జరిగిన ఈ అందమైన సంభాషణను రైలులోనే కూర్చున్న మరో ప్రయాణికుడు కెమెరాలో బంధించాడు. సదరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది. సోషల్ మీడియా యూజర్స్ ఈ వీడియోను  లైక్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నారు.

Also Read:  ప్రభాస్ ట్రీట్ ఇస్తే ప్రపంచం ఫిదా అవ్వదా..! ‘ది బెస్ట్’ అంటూ కరీనా కపూర్ పోస్ట్

అనంతపురం జిల్లాలో బంగారం నిక్షేపాలు.. టన్ను మట్టి తవ్వితీస్తే 4 గ్రాముల గోల్డ్

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!