టాయిలెట్‌ ఫ్లష్‌ ట్యాంక్‌పై రెండు బటన్స్‌ ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా.? వాటిని ఊరికే పెట్టలేదని తెలుసా?

Do You Know: ఒకప్పుడు వెస్ట్రన్‌ టాయిలెట్‌లు కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేవి. హోటళ్లు, సినిమా థియేటర్లలో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా వీటి వినియోగం..

టాయిలెట్‌ ఫ్లష్‌ ట్యాంక్‌పై రెండు బటన్స్‌ ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా.? వాటిని ఊరికే పెట్టలేదని తెలుసా?
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 01, 2021 | 11:44 AM

Do You Know: ఒకప్పుడు వెస్ట్రన్‌ టాయిలెట్‌లు కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేవి. హోటళ్లు, సినిమా థియేటర్లలో ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా వీటి వినియోగం పెరిగిపోయింది. ప్రజల్లో మోకాళ్ల నొప్పులు పెరగడం, తక్కువ స్థలంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండడంతో చాలా మంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంట్లో ఒకటి సాధారణ టాయిలెట్‌ ఉన్నా మరొకటి వెస్ట్రన్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక ధర కూడా అందుబాటులో ఉండడం వీటి వినియోగం పెరగడానికి మరో రీజన్‌గా చెప్పవచ్చు.

అయితే వెస్ట్రన్‌ టాయిలెట్‌లో నీటి ట్యాంక్‌లో ఉండే ఫ్లెష్‌లో రెండు బటన్‌లను మీరు గమనించే ఉంటారు. అయితే చాలా మందికి ఈ రెండు ఎందుకు ఉన్నాయో తెలియదు. మనలో చాలా మంది రెండు బటన్లను నొక్కేస్తాం. అయితే ఈ రెండు బటన్లను వేరు వేరు ఉద్దేశంతో అందించారనే విషయం మీకు తెలుసా? ఏదో చూడడానికి బాగుందని ఇలా తయారు చేయలేదు.. దీని వెనకలా ఓ కారణం ఉంది. అదేంటంటే.. ఇలాంటి టాయిలెట్స్‌ను డబుల్‌ ఫ్లెష్‌ టాయిలెట్స్‌గా పిలుస్తుంటారు. వీటి ట్యాంకులో రెండు రకాల నీటి నిల్వులు ఉంటాయి. ఒకటి ఎక్కువ సామర్థ్యం అయితే మరొకటి తక్కువ సామర్థ్యం. రెండు బటన్‌లలో చిన్నదానిని నొక్కితే తక్కువ నీరు బేసిన్‌లోకి వస్తుంది, అదే పెద్ద బటన్‌ను నొక్కితే ఎక్కువ నీరు వస్తుంది. సాధారణంగా పెద్ద బటన్‌ను నొక్కితే 6 నుంచి 9 లీటర్ల నీరు వస్తుంది. అలాగే చిన్న బటన్‌ను నొక్కితే 3 నుంచి 4.5 లీటర్ల నీరు వస్తుంది.

Toilet Flush

నీటిని ఆదాచేయాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన ఏర్పాటు చేశారు. సాధారణంగా మూత్ర విసర్జనకు టాయిలెట్‌ను ఉపయోగిస్తే చిన్న బటన్‌ను నొక్కాలి. అలాగే మల విసర్జనకు ఉపయోగించినప్పుడు పెద్ద బటన్‌ను నొక్కాలనేది వీటి ప్రధాన ఉద్దేశం. ఇలా రెండు రకాల బటన్లను అందించడం ద్వారా ఒక్క ఏడాదిలోనే 20,000 లీటర్ల నీటిని ఆదాచేయవచ్చని ఓ అంచనా. టాయిలెట్‌ ఫ్లెష్‌కి రెండు బటన్‌లు ఎందుకు ఉంటాయో అర్థమైంది కదా..! ఇకపై టాయిలెట్‌ ఫ్లెష్‌ ఆన్‌ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. నీటిని అనవసరంగా వృథా చేయకండి.

Also Read: Viral News: కలికాలం అంటే ఇదే కదా..! రైస్ కుక్కర్‌తో పెళ్లేంటి గురూ..!

Rana Daggubati: 50 లక్షల మొక్కలను నాటడమే టార్గెట్‌గా ఏరియల్ సీడింగ్ కార్యక్రమం.. పాల్గొన్న హీరో రానా

Road Accident: రహదారిపై మృత్యుతాండవం.. బస్సు, ట్రక్ ఢీకొని ఏడుగురు దుర్మరణం.. నలుగురి పరిస్థితి..