Road Accident: రహదారిపై మృత్యుతాండవం.. బస్సు, ట్రక్ ఢీకొని ఏడుగురు దుర్మరణం.. నలుగురి పరిస్థితి..

Madhya Pradesh Road Accident: వారంతా బస్సులో గమస్థానాలకు బయలు దేరారు. మరికొంత సమయంలో గమ్యస్థానానికి చేరుకుంటారనగా ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: రహదారిపై మృత్యుతాండవం.. బస్సు, ట్రక్ ఢీకొని ఏడుగురు దుర్మరణం.. నలుగురి పరిస్థితి..
Road Accident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 01, 2021 | 10:12 AM

Madhya Pradesh Road Accident: వారంతా బస్సులో గమస్థానాలకు బయలు దేరారు. మరికొంత సమయంలో గమ్యస్థానానికి చేరుకుంటారనగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరికొంతమందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఎంపీలోని భిండ్ జిల్లాలోని గోహడ్ స్క్వేర్ ప్రాంతం వీర్‌ఖాది గ్రామం వద్ద శుక్రవారం ఉదయం వేగంగా వస్తున్న బస్సు.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 13 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొన్నారు. గాయ‌ప‌డ్డ 13 మందిలో మ‌రో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉందని.. వారందరికీ గ్వాలియ‌ర్‌లోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీండ్ ఎస్పీ మ‌నోజ్ సింగ్ వెల్లడించారు.

Also Read:

Shocking Video: వామ్మో.. చిన్నారి ఒడిలో గురకపెడుతున్న భారీ ఫైతాన్.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న వీడియో.. వైరల్

Hyderabad: ఆన్‌లైన్ క్లాసుల కోసం ఫోన్ ఇస్తే.. అదే పనిగా చాటింగ్.. గద్దించిన పేరెంట్స్.. బాలిక షాకింగ్ నిర్ణయం

Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్..