Crime News: ఘరానా కేటుగాడు.. వితంతువులు, ఒంటరి మహిళలే టార్గెట్.. పెళ్లి చేసుకుంటానంటూ..
Matrimony Fraud Case: మోసాలకు పాల్పడటం.. ప్రవృత్తిగా మారింది.. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు.. దీనికోసం ఒంటరి మహిళలను, వింతంతువులను
Matrimony Fraud Case: మోసాలకు పాల్పడటం.. ప్రవృత్తిగా మారింది.. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు.. దీనికోసం ఒంటరి మహిళలను, వింతంతువులను లక్ష్యంగా చేసుకున్నాడు. వారిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి.. అందినకాడికి దండుకుంటాడు. అలా ఎందరినో మోసగించిన కేటుగాడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. మ్యాట్రిమోని సైట్లలో వితంతువులు, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న ములుగు జిల్లా ఇంచర్ల గ్రామానికి చెందిన కోరండ్ల కిరణ్ కుమార్ రెడ్డి (29) ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ యువతి ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ఛేధించారు. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితుడిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కిరణ్‌తో పాటు ఇంకా ఎవరైనా ఈ కేసులో ఉన్నారా..? ఇప్పటివరకు ఎంతమంది మహిళలను ఇలా మోసం చేశాడు? ఎంత మొత్తంలో డబ్బులు కాజేశాడు వంటి వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం కోర్టు ఎదుట హాజరుపర్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అయితే.. నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డి వివిధ మ్యాట్రిమోని సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వితంతువులు, విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న మహిళలను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు. అనంతరం వారికి దగ్గరై డబ్బులతో ఉడాయించేవాడని పోలీసులు తెలిపారు. ఇలా నిందితుడు కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు మహిళలను మోసం చేసినట్లు కేసు విచారణలో వెల్లడైంది.
అయితే.. కిరణ్ చేతిలో మోసపోయిన ఓ మహిళ ఆగస్ట్ 22న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు ఈ కేసును పట్టించుకోకపోవడంతో.. అవమానం తట్టుకోలేక ఆమె సెప్టెంబర్ 19న ఆత్మహత్య చేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పేర్కొంటున్నారు.
Also Read: