Watch: అంతా మనదే.. ఉద్యోగులకు ఏకంగా రూ. 70 కోట్ల బోనస్.. కానీ ఒక్క కండీషన్
ఇక్కడ ఓ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించారు. వారి ముందు కుప్పలుగా నోట్లు కుమ్మరించాడు..15 నిమిషాల సమయంలో వారు ఎంత డబ్బు కావాలంటే అంత లెక్కించి తీసుకోవాలంటూ ఊహించని ఆఫర్ ప్రకటించాడు. ఛాన్స్ వచ్చిందని టేబుల్‌పై ఉన్న డబ్బును ఎగబడి తీసుకున్నారు ఉద్యోగులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సీన్ చూసిన నెటిజన్లు ఇలాంటి అవకాశం మాకెప్పుడు వస్తుందా అనుకుంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

సాధారణంగా చాలా కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు ప్రతి సంవత్సరం కొంత మొత్తంలో డబ్బులు బోనస్‌గా ఇస్తుంటారు. ఈ డబ్బు చెక్కు ద్వారా లేదా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. అయితే ఇక్కడ ఓ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు భారీ బోనస్ ప్రకటించారు. వారి ముందు కుప్పలుగా నోట్లు కుమ్మరించాడు..15 నిమిషాల సమయంలో వారు ఎంత డబ్బు కావాలంటే అంత లెక్కించి తీసుకోవాలంటూ ఊహించని ఆఫర్ ప్రకటించాడు. ఛాన్స్ వచ్చిందని టేబుల్‌పై ఉన్న డబ్బును ఎగబడి తీసుకున్నారు ఉద్యోగులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ సీన్ చూసిన నెటిజన్లు ఇలాంటి అవకాశం మాకెప్పుడు వస్తుందా అనుకుంటున్నారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
చైనాకు చెందిన హెనాన్ మైనింగ్ క్రేన్ కో. లిమిటెడ్ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు సంవత్సరాంతపు బోనస్ డబ్బును ప్రత్యేకమైన రీతిలో ప్రకటించాడు. దాదాపు 100 మిలియన్ యువాన్ అంటే 70 కోట్ల రూపాయలు. టేబుల్‌పై కుమ్మరించిపోశాడు.. ఆపై ఉద్యోగులను వరుసలో ఉంచాడు. మీరు 15 నిమిషాల్లో మీకు కావలసినంత డబ్బును లెక్కించి తీసుకోవచ్చని ప్రకటించాడు. దాంతో ఉద్యోగులంతా ఎగబడ్డారు. చేతికి అందినకాడికి డబ్బులు లెక్కపెట్టి ఎవరికి దొరికింది వారే బోనస్‌గా తీసుకున్నారు.
View this post on Instagram
mothershipsg పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో కంపెనీ ఉద్యోగులు టేబుల్‌పై నోట్లను లెక్కించడం స్పష్టంగా కనిపించింది. ఇలా 15 నిమిషాల్లో తమ చేతికి అందినంత డబ్బును లెక్కించి ఆ డబ్బును వారు తమ సొంతం చేసుకున్నారు. ఒక రోజు క్రితం షేర్ చేయబడిన ఈ వీడియో 1 మిలియన్లకు పైగా వ్యూస్, వేల సంఖ్యలో కామెంట్లను సంపాదించింది. నెటిజన్లు సైతం తమ స్టైల్లో వీడియోపై స్పందించారు.
ఇది కూడా చదవండి: బీచ్‌లో వాకింగ్ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..