పులి మూత్రం అమ్ముతున్న జూ నిర్వాహకులు.. ఒక్క సీసా ఎంతో తెలుసా..?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని వార్తలు వింటుంటే తల తిరుగుతుంది. ఇప్పుడు ఓ జూ పులి మూత్రాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటోందంటూ ఓ వింత వార్త వినిపిస్తోంది. అవును బెణుకు, కండరాల నొప్పి, వాతానికి మందుగా పులి మూత్రాన్ని విక్రయిస్తున్నారు. 250 మి.లీ పులి మూత్రం రూ. 600 విక్రయిస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

టెక్నాలజీ పరంగా అందరినీ మించిపోయేలా ఎదిగిన చైనా.. ఆహారపు అలవాట్లు, కొన్ని వింత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. చైనీస్ జూ ఇప్పుడు పులి మూత్రాన్ని విక్రయిస్తూ ప్రపంచ వ్యాప్తంగా మరోమారు వార్తల్లో నిలిచింది.. అవును, చైనాలోని ఒక జూ పులి మూత్రాన్ని అమ్ముతూ డబ్బు సంపాదిస్తోంది. బెణుకు, కండరాల నొప్పులు, వాతానికి ఇది ఔషధంగా వారు ప్రచారం చేస్తున్నారు. 250 మిల్లీ లీటర్ల పులి మూత్రం రూ. 600 విక్రయిస్తున్నారు. ఈ వార్త వైరల్ కావడంతో పులి మూత్రం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే చర్చ ఇంటర్‌నెట్ వేదికగా విస్తృతంగా మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని యాన్ బిఫెంగ్జియా వైల్డ్‌లైఫ్ జూ 250 ml సైబీరియన్ టైగర్ మూత్రాన్ని విక్రయిస్తోంది. దాదాపు 50 యువాన్లు లేదా రూ. 600కి విక్రయిస్తోంది. పులి మూత్రం నింపిన బాటిళ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఓ పర్యాటకుడు ఈ విషయాన్ని వెల్లడించాడు.
పోస్ట్ (SCMP) ప్రకారం…చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని ఒక జంతుప్రదర్శనశాలలో సైబీరియన్ పులి మూత్రాన్ని సీసాలో విక్రయిస్తోంది. పులి మూత్రం కండరాల నొప్పి, దీర్ఘకాలిక రుమాటిజం, బెణుకుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. తెల్ల వైన్‌లో నానబెట్టిన అల్లం సహాయంతో నొప్పి ఉన్న ప్రదేశంలో పులి మూత్రాన్ని పూయండి, అని జూలోని ఔషధ తయారీదారు పులి మూత్రం సీసాలపై రాసి ఉంచారు.
ఈ విషయంపై చైనా మీడియా వైద్య నిపుణులతో మాట్లాడినప్పుడు వారు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వారిలో చాలామంది పులి మూత్రం సాంప్రదాయ ఔషధం కాదని, దీనికి నిరూపితమైన ఔషధ గుణాలు లేవని పేర్కొన్నారు. పులి మూత్రాన్ని విక్రయించడం ప్రమాదకరమని, ప్రయోజనకరం కాదని కొందరు నిపుణులు అభివర్ణించారు.
ఇది కూడా చదవండి: అంతా మనదే.. ఉద్యోగులకు ఏకంగా రూ. 70 కోట్ల బోనస్.. కానీ ఒక్క కండీషన్
ఇది కూడా చదవండి: బీచ్‌లో వాకింగ్ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..