Viral Video: వాట్ ఏ స్మార్ట్ ఎలుగుబంటి.. కెమెరా దొరకడమే ఆలస్యం సెల్ఫీ దిగేసింది..!
Viral Video: అమెరికాలో వ్యోమింగ్ హిల్స్ మంచుతో నిండిన పర్వతప్రాంతం. జనసంచారం లేని ఈ ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువ.
Viral Video: అమెరికాలో వ్యోమింగ్ హిల్స్ మంచుతో నిండిన పర్వతప్రాంతం. జనసంచారం లేని ఈ ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువ. ఇక్కడ నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తి తన గో ప్రో కెమెరా పోగొట్టుకున్నాడు. దాని కోసం అన్వేషిస్తూ వెళ్ళిన అతనికి కొంతకాలం తర్వాత దొరికింది కెమెరా. ఇంటికి తెచ్చి చార్జింగ్ పెట్టి చూడగా ఎలుగుబంటి సెల్ఫీ వీడియో చూసి కంగుతిన్నాడు. ఈ ఫన్నీ విజువల్స్‌ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది.
వివరాల్లోకెళితే.. వ్యోమింగ్ హిల్స్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఎలుగుబంటికి గో ప్రో కెమెరా కనిపించింది. ఇంకేముంది? కెమెరాను ఆహారంగా భావించి తినే ప్రయత్నం చేసింది. మంచులో కూరుకుపోయిన కెమెరాను బయటకు తీయడానికి నోటితో చేతి గోళ్ళతో చాలా సేపు ప్రయత్నించింది. మధ్యలో అలసిపోయి కాసేపు కూర్చుండిపోయింది. రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రయత్నం కొనసాగించింది. ఈ క్రమంలో కెమెరా ఆన్ అయి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఎంతోసేపటికి గానీ అది తినే వస్తువు కాదని దానికి అర్థం కాలేదు. ఆ తర్వాత కెమెరాను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది.
అయితే, గో ప్రో కెమెరాను ఆన్ చేసి, సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన బ్లాక్ బేర్ ఫన్నీ విజువల్స్‌ను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. దాంతో వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు నాలుగున్నర మిలియన్ వ్యూస్ రాగా, వేలలో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.
Viral Video:
GUYS A BEAR FOUND A GOPRO AND TURNED IT ON pic.twitter.com/BhN8oyw3F8
— teddy (@NE0NGENESlS) October 2, 2021
Also read:
MAA Elections 2021: ప్రకాష్ రాజ్ ని తొక్కడం ఎవరివల్లా కాదు.. లైవ్ వీడియో
Telangana: పాఠశాల ముసుగులో పాడు పనులు.. ఆరా తీయగా బయటపడిన షాకింగ్ విషయాలు..