NASA 16 Psyche: ఆ ఉల్క భూమికి చేరితో ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులే!.. నాసా పరిశోధనలో షాకింగ్ అంశాలు..

NASA 16 Psyche: మరికొద్ది రోజుల్లో ఓ భారీ గ్రహశకలం భూమివైపుకు దూసుకు వస్తుంది.. అది భూమిని ఢీకొడితే నాశనమే.. సమస్త జీవకోటి అంతరించిపోవడం ఖాయం..

NASA 16 Psyche: ఆ ఉల్క భూమికి చేరితో ప్రతీ ఒక్కరూ కోటీశ్వరులే!.. నాసా పరిశోధనలో షాకింగ్ అంశాలు..
Asteroid
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 08, 2021 | 9:10 AM

NASA 16 Psyche: మరికొద్ది రోజుల్లో ఓ భారీ గ్రహశకలం భూమివైపుకు దూసుకు వస్తుంది.. అది భూమిని ఢీకొడితే నాశనమే.. సమస్త జీవకోటి అంతరించిపోవడం ఖాయం.. ఇలా మూడు నెలలకో వార్త మనకు వినిపిస్తూనే ఉంటుంది. వాస్తవానికి కూడా గ్రహశకలాలు భూమిని ఢీకొంటే పెను విపత్తు ఏర్పడుతుంది కానీ, ఇప్పుడు మాత్రం అలాంటి ప్రమాదాలు అంతగా ఉండవు. కారణం నాసా సహా ప్రపంచ దేశాల అంతరిక్ష కేంద్రాల శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ఆస్టరాయిడ్‌లను చెక్‌ చేస్తుంటారు. అయితే, ప్రత్యేకించి నాసా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. భూమి మీదకు దూసుకువచ్చే గ్రహశకలాలను దారిమళ్లించండం.. రసాయనిక చర్య ద్వారా అంతరిక్షంలోనే పేల్చేయడం వంటివి చేస్తుంటారు. అయితే, ఇప్పుడు కూడా ఓ ఆస్ట్రాయిడ్‌కు సంబంధించి వార్త ప్రముఖంగా వస్తోంది. కానీ, అది భూమిని ఢీ కొడుతుందని కాదు.. అందులో బోలెడన్ని ఖనిజాలు ఉన్నాయట. ఆ ఖనిజాలు భూమ్మీదకు వస్తే ఇక్కడున్న ప్రతీ ఒక్కరు చిన్నపాటి కుబేరులవుతారట. ఇంతకీ ఆ గ్రహశకలం ఏమిటి? దాని కథ ఏంటి? వివరాలు ఇప్పుడు చూద్దాం..

అనంతమైన విశ్వం పుట్టుక మీద, ఇతర గ్రహాలపై మానవ మనుగడ మీద వందలు, వేల కోట్లు ఖర్చుపెట్టి పరిశోధనలు చేస్తోంది నాసా. అయితే తాజాగా నాసా కన్ను ఓ ఆస్ట్రాయిడ్ మీద పడింది. ఉల్క అంటే అదేదో రివ్వున దూసుకొచ్చి, భూమ్మీద పడిపోయేది కాదు. వేగంగా దూసుకొచ్చి భూమిని బద్దలు చేసేది అంతకన్నాకాదు. దాని వల్ల నష్టంలేదు. పైగా లాభం ఉంది. అదే ‘16సైకీ’ ఉల్క. వినేందుకు కాస్త వింతగా ఉన్నా.. దీనిపైనే నాసా ప్రస్తుతం పరిశోధనలు చేస్తోంది.

అంగారక గ్రహం, గురు గ్రహం మధ్యలో ఉన్న ఈ ఆస్ట్రాయిడ్.. భూమికి 23 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉందట. అలాగే 140 మైళ్ల వ్యాసంతో దీని సైజు ఉందట. అయితే నాసా ఇంతకాలం చేసిన పరిశోధనలు వేరు, ఈ పరిశోధన వేరు. ఎందుకంటే ఇంతకాలం ఇతర గ్రహాలపై నీళ్లు, రాళ్లు అంటూ సాగిన పరిశోధనలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. నాసా తొలిసారిగా లోహాల కోసం పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ పరిశోదనల్లో ‘16 సైకీ’ అనే ఆస్ట్రాయిడ్‌ విచిత్రంగా, విలువైనదిగా కనిపించింది.

నాసా పరిశోధిస్తున్న ‘16 సైకీ’ అనే ఆస్ట్రాయిడ్‌లో లోహాలు ఎక్కువగా ఉన్నాయట. ఈ ఉల్కలోని లోహాల విలువ ఎంతో తెలుస్తే ఆశ్చర్యపోతారంటున్నారు. ఈ లోహాల విలువ 10వేల క్వాడ్రిలియన్‌ డాలర్లు. సింపుల్‌గా చెప్పాలంటే భూమ్మీద పుట్టిన ప్రతి ఒక్కరికి పంచితే కనీసం ఏడువేల కోట్ల రూపాయలు వస్తాయన్నమాట. భూమండలంలో అనేకానేక పనులకు కావల్సిన లోహాలు లక్షల ఏళ్లపాటు వాడుకోవలసినంత ‘16 సైకీ’లో ఉన్నట్లు చెబుతున్నారు సైంటిస్టులు. ఈ ఆస్ట్రాయిడ్‌ మీద నికెల్‌, ఉక్కు నిల్వలు 17 మిలియన్‌ బిలియన్‌ టన్నులుగా ఉండొచ్చని బెర్న్‌స్టీన్‌ అనే రీసెర్చ్‌ సంస్థ లెక్కలు గట్టింది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Also read:

Aadi Saikumar: నయా మూవీ మొదలు పెట్టిన యంగ్ హీరో.. మరో యాక్షన్ థ్రిల్లర్‌కు శ్రీకారం చుట్టిన ఆది సాయికుమార్..

Viral Video: నగలు కాజేసేందుకు మంచి స్కెచ్‌తో వచ్చారు.. కానీ చివరికి అడ్డంగా బుక్కయ్యారు.. షాకింగ్ వీడియో..

Indian Air Force Day 2021: అబ్బురపరిచే విన్యాసాలు.. గగనతంలో రంగుల హరివిల్లులు.. నేడు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ డే