Indian Air Force Day 2021: అబ్బురపరిచే విన్యాసాలు.. గగనతంలో రంగుల హరివిల్లులు.. నేడు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ డే

Indian Air Force Day 2021: దేశ రక్షణలో సైనికుల గురించి ఎంత వర్ణించిన తక్కువే. అక్టోబర్‌ 8న ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌డే జరుపుకొంటారు.  1971 యుద్ధంలో..

Indian Air Force Day 2021: అబ్బురపరిచే విన్యాసాలు.. గగనతంలో రంగుల హరివిల్లులు.. నేడు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ డే
Indian Air Force Day 2021


Indian Air Force Day 2021: దేశ రక్షణలో సైనికుల గురించి ఎంత వర్ణించిన తక్కువే. అక్టోబర్‌ 8న ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌డే జరుపుకొంటారు.  1971 యుద్ధంలో పాకిస్తాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్‌లో భారత్‌ సహాయపడింది. యుద్ధ సమయాల్లో తక్షణమే రంగంలోకి దిగి దేశాన్ని కాపాడే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 89వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. భారత గగనతలాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తోన్న వైమానిక దళాన్ని 1932 అక్టోబర్ 8న అధికారికంగా ఏర్పాటు చేశారు. అయితే స్వాతంత్ర్యానికి ముందు వైమానిక దళాన్ని రాయల్‌ ఇండియా ఎయిర్‌ఫోర్స్‌ అని పిలిచేవారు. ఆ తర్వాత ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌గా పిలువబడుతోంది. ఈ దినోత్సవం సందర్భంగా.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో సిబ్బంది పరేడ్ నిర్వహిస్తారు.

పరేడ్ ముగిసిన అనంతరం వైమానిక దళ సిబ్బంది విన్యాసాలు చేపడతారు. ఎయిర్‌ఫోర్స్‌కు యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఈ విన్యాసాలు చేపడతారు. రెండు ప్రపంచ యుద్దాలలో వైమానిక దళం కూడా కీలక పాత్ర పోషించింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వైమానిక దళం ఐదు యుద్ధాలలో పాల్గొంది. 1948,1965,1971, 1999లో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్నాయి. అలాగే 1962లో కూడా భారత వైమానిక దళం చైనాపై కూడా యుద్దానికి దిగింది.

ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఆయుధాలు, రాడార్, క్షిపణి వ్యవస్థలను వీక్షించేందుకు సాధారణ ప్రజలకు అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తమ వంతు సహకారాన్ని అందించాలని భారతవాయుసే ఢిల్లీ, ఘజియాబాద్‌, పరిసర ప్రాంతాల ప్రజలను కోరింది. సాధారణంగా పక్షులు ఎగుతున్నప్పుడుల్లా విమానాలకు తీవ్రమైన ముప్పు ఉంటుంది. ముఖ్యంగా కింది స్థాయి విమానాలు తిరుగుతున్నప్పుడు ఈ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. బహిరంగంగా విసిరిన ఆహారాలు పక్షులను ఆకర్షిస్తాయి. తద్వారా పక్షులు ఎక్కువ తిరిగే అవకాశాలుంటాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ, ఘజియాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తినుబండారాలు కానీ, చెత్తాచెదారాన్ని బహిరంగంగా వేయవద్దని భారత వైమానిక దళం కోరింది.

ఘజియాబాద్‌ హిందాస్‌ ఎయిర్‌ఫోర్స్‌ వేదికగా..

ప్రతి ఏడాది ఉత్తర ప్రదేశ్‌ ఘజియాబాద్‌ హిందాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ డే ఉత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో ఏఎఫ్‌ చీఫ్‌, సీనియర్‌ అధికారులు పాల్గొంటారు. ఏప్రిల్‌ 1, 1933 నుంచి సైన్యం కేవలం శిక్షణ కోసం మొదలుపెట్టినప్పటికీ.. పూర్తిస్థాయిలో రెండో ప్రపంచ యుద్ధంలోనే రంగంలోకి దిగింది. అయితే గత 89 ఏళ్లుగా స్వాతంత్ర్యం అనంతరం.. వాయు సేన క్రమక్రమంగా తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో బ్రిటన్‌ రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ను సైతం వెనక్కి నెట్టేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యాల తర్వాత అతిపెద్ద వాయుసేనను కలిగి ఉన్న వ్యవస్థగా భారత్‌ నిలిచింది. భారత వాయు సేనలో ప్రస్తుతం సుమారు 1,400 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, లక్షా 70 వేల మంది సిబ్బంది ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇంకో విషయం ఏంటంటే.. ఉత్తరప్రదేశ్‌లోని హిందాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ ఆసియాలో అతిపెద్దది. ప్రపంచంలో 8వ పెద్ద ఎయిర్‌ బేస్‌గా పేరుంది. అందుకే ఇక్కడ ఉత్సవాల్ని నిర్వహిస్తారు.

ఇవీ కూడా చదవండి:

Blue Color Aadhaar: నీలం రంగులో ఉన్న ఆధార్‌ను ఎవరికి జారీ చేస్తారు.. ఈ కార్డు పొందడం ఎలా..?

China Army: చైనా సైనికులకు చుక్కలు చూపిస్తున్న హిమాలయాలు.. మావల్ల కాదంటున్న డ్రాగన్ సోల్జర్స్..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu