India Covid-19: గుడ్‌న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు.. 204 రోజుల తర్వాత…
India Coronavirus Updates: కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు

India Coronavirus Updates: దేశంలో కరోనా ఉధృతి నిత్యం పెరుగుతూనే ఉంది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం.. కేసుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ మళ్లీ పెరుగుతున్న కేసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో రెండు రోజులుగా భారీగా తగ్గిన కేసులు మళ్లీ 20 మార్క్ దాటుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 21,257 కేసులు నమోదయ్యాయి. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. దేశంలో ప్రస్తుతం 2,44,198 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 204 రోజుల్లో ఇదే అత్యల్పమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,39,15,569 కి పెరిగింది.
గత 24 గంటల్లో కరోనాతో 318 ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి మరణాల సంఖ్య 4,49,856 కు పెరిగింది. నిన్న కరోనా నుంచి 24,963 మంది కోలుకున్నారు. వీరితో కలిపి దేశంలో ఇప్పటివరకు 3,32,25,221 మంది కోలుకున్నారు.
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల రేటు 0.72 శాతం ఉండగా.. రికవరీ రేటు 97.95 శాతంగా ఉంది. ఇది మార్చి 2020 తర్వాత అత్యధికమని మంత్రిత్వ శాఖ తెలిపింది.
దీంతోపాటు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 93.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదిలాఉంటే.. నిన్న దేశవ్యాప్తంగా 13,85,706 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటివరకు 58,00,43,190 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.
Also Read: