Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: స్నేహితుడి భార్యతో తండ్రి అక్రమ సంబంధం.. వద్దన్నా వినడం లేదని దారుణంగా..

Anantapur murder case: ఏపీలోని అనంతపురంలో సంచలనం రేపిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల్లో నిందితులను అరెస్టు చేసినట్లు

Crime News: స్నేహితుడి భార్యతో తండ్రి అక్రమ సంబంధం.. వద్దన్నా వినడం లేదని దారుణంగా..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 08, 2021 | 9:01 AM

Anantapur murder case: ఏపీలోని అనంతపురంలో సంచలనం రేపిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల్లో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కన్న తండ్రిని హత్య చేసిన కుమారుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పరాయి మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ కుటుంబాన్ని నిరాదరణకు గురి చేయడమే హత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జిల్లా కేంద్రం అనంతపుంర ఏ. నారాయణపురం పంచాయతీ, ఇందిరమ్మ కొట్టాలలో నివాసం ఉంటున్న అలకుంట నగేశ్‌ను 4వ తేది రాత్రి 10.30 గంటల సమయంలో హత్య చేశారని తెలిపారు. మృతుని కొడుకు నాగరాజు, అతని ఇద్దరు స్నేహితులు మధుసూదన్, సురేశ్ సహకారంతో ఇనుప రాడ్‌తో కొట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. అనంతరం రగ్గులో చుట్టి ఇంట్లో నుంచి శవాన్ని ఆటోలో తీసుకెళ్లి పావురాల గుట్ట సమీపంలో ఉన్న హెచ్ఎల్సీ కెనాల్లో శవానికి బరువైన రాయి కట్టి పడేశారు.

హత్యకు గురైన అలకుంట నగేశ్ తన భార్య లక్ష్మీదేవి చనిపోయిన తరువాత ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదే తరహాలో చాలా మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకొనెవాడని.. ఆ తరువాత వారికి కొంత డబ్బులు ఇచ్చి వదిలించుకునేవాడు. ఈక్రమంలో ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. ఈ విషయంలో నాగరాజు తన తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. అంతేకాకుండా కొడుకుకి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి భార్యను లోబరచుకుని ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈవిషయంలో కూడా తండ్రీ కొడుకుల మధ్య గొడవలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నాగరాజు, ఇతని ఇద్దరు స్నేహితులు మధుసూదన్, సురేశ్ సహకారంతో ఇనుప రాడ్‌తో కొట్టి, ఊపిరి ఆడకుండా చేసి హత్యచేసినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

Also Read:

Crime News: వీడు మామూలోడు కాదు.. ఒక అమ్మాయితో స్నేహం.. 50 మంది మైనర్లు, టీచర్లకు వల.. చివరకు..

Crime News: స్కూలుకు వెళ్లొస్తానమ్మా అంటూ వెళ్లాడు.. అవే చివరి మాటలయ్యాయి.. తేలు కాటేయ్యడంతో..