Viral Video: ఆటో నడుపుతూ పాటలతో ఎంజాయ్ చేస్తున్న డ్రైవర్.. అభిరుచి గ్రేట్ అంటున్న నెటిజన్లు
వైరల్ అవుతున్న ఈ వీడియో ముంబైకి చెందినదిగా తెలుస్తోంది. ఇందులో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను 'కచేరీ వేదిక'గా మార్చాడు. అతని ప్రతిభే కాదు అతని ఆటో కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 1.5 లక్షల మంది లైక్స్ ను సొంతం చేసుకుంది. రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.

మన దేశంలో టాలెంటెడ్ పర్సన్ కు లోటు లేదు. అనేకరకాల ప్రతిభావంతులతో నిండి ఉంది. ప్రపంచం ముందు తమ ప్రతిభను ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో చాలా మందికి తెలుసు. అదే సమయంలో చాలా మందికి తమ ప్రతిభను పదిమంది ముందు ప్రదర్శించడం అంతగా తెలియదు. వీరి ప్రతిభ కేవలం వినోద సాధనంగా మిగిలిపోతుంది. ఎప్పుడైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల పేజీని స్క్రోల్ చేస్తే.. ఇలాంటి ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రతిభకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా వ్యక్తిని చాలా ప్రశంసిస్తారు.
వైరల్ అవుతున్న ఈ వీడియో ముంబైకి చెందినదిగా తెలుస్తోంది. ఇందులో ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను ‘కచేరీ వేదిక’గా మార్చాడు. అతని ప్రతిభే కాదు అతని ఆటో కూడా ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 1.5 లక్షల మంది లైక్స్ ను సొంతం చేసుకుంది. రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక్కడ వీడియో చూడండి
View this post on Instagram
ఈ వీడియోపై వ్యాఖ్యానిస్తూ ఒకరు ‘బ్రదర్ ఏమి జరిగినా అభిరుచిని కోల్పోకూడదు..’ అని వ్రాయగా, మరొక వినియోగదారు ‘అభిరుచి నిజంగా చాలా గొప్ప విషయం’ అని కామెంట్ చేశారు. మరొకరు ‘అంకుల్ నిజంగా తన అంతర్గత ప్రతిభను నేడు బహిరంగంగా ప్రదర్శించాడు. ఇది నిజంగా చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు.
ఆటో డ్రైవర్ తన వాహనంలో పటిష్టమైన మ్యూజిక్ కు సంబంధించిన వ్యవస్థను అమర్చినట్లు వీడియోలో చూడవచ్చు. దీంతో పాటు మైక్‌ను కూడా తన వద్ద ఉంచుకున్నారు. దీని సహాయంతో అతను మహమ్మద్ రఫీ హిట్ పాటను పాడుతున్నాడు. ఈ ఫన్నీ వీడియోను అమిత్ త్రివేది తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అమిత్ త్రివేది బాలీవుడ్ ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చిత్రం కేదార్‌నాథ్‌లోని సూపర్ హిట్ సాంగ్ ను నమో-నమోను అమిత్ త్రివేది పాడారు. మ్యూజిక్ ను కూడా అందించారు. ఈ పాట నేటికీ ప్రజల నోటిలో హమ్మింగ్ అవుతూనే ఉంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..